కొండా సురేఖ నాకు స్ఫూర్తి.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సంచలనం!
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొండా సురేఖ వ్యవహారం తీవ్ర చర్చకు కారణమవుతుంది. మొన్నటికి మొన్న కేటీఆర్ ను టార్గెట్ చేయబోయి అక్కినేని నాగార్జున కుటుంబం పైన సంచలన వ్యాఖ్యలు చేసి, నాగచైతన్య సమంత విడాకులకు కేటీఆర్ కారణమంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసిన కొండ సురేఖ రేపిన దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీని తాలూకా పరువు నష్టం దావా కేసులను కొండా సురేఖ ఎదుర్కొంటోంది.
వరుస వివాదాలలో కొండా సురేఖ
ఇక ఇదే సమయంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కొండా వర్గీయుల మధ్య చోటు చేసుకున్న ఫ్లెక్సీల వివాదం తర్వాత కూడా కొండా సురేఖ తన అనుచరులు కార్యకర్తల జోలికి వస్తే ఉక్కు పాదంతో తొక్కేస్తానని వ్యాఖ్యలు చేశారు. గీసుకొండ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సీఐ సీట్లో కూర్చొని కొండ సురేఖ మరో వివాదానికి కారణమయ్యారు.

కొండా సురేఖపై ఎమ్మెల్యేల ఫిర్యాదు
తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా సురేఖని వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలు అధిష్టానానికి కొండా సురేఖ తీరుపైన ఫిర్యాదు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు మంత్రి కొండ సురేఖ తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమ నియోజక వర్గాలలో కొండా దంపతుల జోక్యం ఎక్కువైందని కొండా సురేఖ పైన ఇప్పటికే పార్టీ ఇన్చార్జి దీపాదాస్ మున్షీకి, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు.
సురేఖను మెచ్చుకున్న ఎమ్మెల్యే
కొండా సురేఖని మంత్రివర్గం నుంచి తప్పించాలన్న డిమాండ్ కూడా ఆయా ఎమ్మెల్యేలు వినిపిస్తున్నారు. ఇక ఇలాంటి సమయంలో కొండా సురేఖ విషయంలో చాలా సానుకూలంగా స్పందించారు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలలో ఒకరైన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ప్రస్తుతం ఆమె కొండా సురేఖకు మద్దతుగా ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. కొండా సురేఖపైన ఆసక్తికర పోస్టు పెట్టిన యశస్విని రెడ్డి కొండ సురేఖ ప్రజలకోసం నిలబడే వ్యక్తింటూ ప్రశంసలజల్లు కురిపించారు.
I met Hon’ble Minister @TeamSurekha Garu, today at a private function in Hanumakonda.She is a dynamic leader who has consistently proven to stand firm for the people and tirelessly work towards the progress.Her resilience and commitment to public service continue to inspire us. pic.twitter.com/1zRkwEnLW2
— Mamidala Yashaswini (@YJR_INC) October 16, 2024
కొండా సురేఖ స్ఫూర్తి అన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
హన్మకొండలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ లో తాను కొండ సురేఖని కలిశానని ఆమె ఒక డైనమిక్ లీడర్ అంటూ కొనియాడారు. ప్రజల కోసం విశ్రాంతి లేకుండా పనిచేసి, అభివృద్ధికి బాటలు వేసే నాయకురాలని పేర్కొన్నారు. తన వంటి వారికి కొండ సురేఖ స్ఫూర్తి అంటూ ట్వీట్ చేశారు. ఇక కొండా సురేఖ పైన ఉమ్మడి వరంగల్ జిల్లాలో మెజారిటీ ఎమ్మెల్యేలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న వేళ యశస్విని రెడ్డి మద్దతుగా నిలబడడం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది .












Click it and Unblock the Notifications