కుండబద్దలు కొట్టిన కోమటిరెడ్డి, అనిరుధ్- ఢిల్లీ అలర్ట్..!!

తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రత్యేక భేటీలు సంచలనంగా మారాయి. ఈ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ అలర్ట్ అయ్యారు. సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసారు. పార్టీ వైఖరి స్పష్టం చేసారు. గీత దాటవద్దని హెచ్చరించారు. ఇదే సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుథ్ రెడ్డి కీలక అంశాల ను ప్రస్తావించారు. తాము ఏం కోరుకుంటున్నామో స్పష్టం చేసారు. అటు ఢిల్లీలో రాష్ట్ర పరిణామా ల పైన పార్టీ అధినాయకత్వంతో రేవంత్ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

తేల్చి చెప్పిన రేవంత్
పార్టీ ఎమ్మెల్యేల మీటింగ్స్ తో సీఎం రేవంత్ అప్రమత్తం అయ్యారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛా ర్జ్.. పీసీసీ అధ్యక్షుడితో కలిసి సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా తన వద్దకు రావాలని సూచించారు. తాను, పీసీసీ చీఫ్ ఎప్పుడూ అందుబాటులోనే ఉంటామని చెప్పు కొచ్చారు. ఎవరూ గీత దాటవద్దని హెచ్చరించారు. ఎవరైనా పార్టీని దాటి వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఏకపక్ష నిర్ణయాలు సరికాదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పథకాలు అమలు చేసినా... విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. అందరితో చర్చించి అమలు చేస్తూ ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు.

MLA s Rajagopla Reddy and Anirudh comments in CLP meeting goes viral in Party

ఏకపక్ష నిర్ణయాలు
రైతు రుణామాఫీ కోసం 21 వేల కోట్లు వెచ్చించినా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందని రాజ గోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతు భరోసాను పటిష్ఠంగా అమలు చేస్తే సరిపోయేదనే అభిప్రాయం వ్యక్తం చేసారు. ఆర్దిక పరిస్థితి గురించి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిందని పేర్కొన్నారు. అందరికీ ఇళ్లు, రేసణ్ కార్డులు ఇవ్వలేనప్పుడు అర్హుల జాబితా ప్రకటించటం దేనికని ప్రశ్నించారు. చిన్న చిన్న పనులు చేసిన కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు ఇవ్వటం లేదని.. రోడ్లు కూడా సరిగ్గా లేవని, ఈ సమయంలో కొత్త పథకాలు ఎందుకని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ మధ్య ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ సైతం ఈ సమావేశంలో తన అభిప్రాయాలను స్పష్టం చేసారు.

సీల్డ్ కవర్ లో సమస్యలు
నాలుగు గ్రామాల్లో సిలింగ్ లో భూములు కోల్పోయిన వారే మళ్లీ ఆ భూములను వినియోగించు కుంటున్నారని చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో ఆ గ్రామాలకు కూడా ప్రచారానికి రానీయని విషయాన్ని గుర్తు చేసారు. ఒక్కో గ్రామంలో 40 నుంచి 60 ఎకరాల వరకు ఉందని చెప్పుకొచ్చారు. ఈ భూములను స్వాధీనం చేసుకొని అర్హులకు ఇవ్వాలని కోరినా పట్టించుకోవటం లేదని అనిరుథ్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. తాను కీలక అంశాలను సీల్డ్ కవర్ లో అందిస్తానని చెప్పారు. కాగా, ఈ అంశాల పైన సమావేశంలో పార్టీ ముఖ్యులు ఎవరూ స్పందించలేదని సమాచారం. మరి కొందరు ఎమ్మెల్యేలు సైతం తమ అభిప్రాయాలను స్పష్టం చేసారు. ఈ భేటీ తరువాత ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్.. పార్టీ అధినాయకత్వంతో తాజా పరిణామాల పైన చర్చించి.. భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+