సుఖేశ్‌తో పరిచయంపై ఎమ్మెల్సీ కవిత వివరణ: దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్టుంది!!

సుఖేష్ చంద్రశేఖర్ తో ఎమ్మెల్సీ కవితకు పరిచయం ఉందని జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆర్థిక మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ తో తనకు ఎలాంటి పరిచయం లేదని కవిత స్పష్టం చేశారు. నకిలీ చాట్లతో తనపై దుష్ప్రచారం చేయాలని కొందరు చూస్తున్నారంటూ ఆమె విరుచుకుపడ్డారు.

కెసిఆర్ ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేని వాళ్ళు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ కవిత మండిపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేక పోతున్నారని, అందుకే తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారంటూ మండిపడ్డారు.

 kavithasukheshchandrasekhar

ఒక ఆర్థిక నేరగాడు అనామక లేఖ రాస్తే దానిని వెంటనే బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం, దాని తదినంతరమే ఎంపీ అరవింద్ బిజెపి టూల్ కిట్ లో భాగంగా పనిగట్టుకుని సామాజిక మాధ్యమాలలో బురదజల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యతిరేకులు మీడియా సంస్థలను గుప్పెట్లో పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ మీద ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారన్నారు.

పాత్రికేయులు కనీస విలువలు పాటించకపోవడం అత్యంత బాధాకరమని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తన మొబైల్ ఫోన్ల విషయంలో కూడా ఇలాగే తొందరపడి వార్తలు రాసి తర్వాత తోక ముడిచారని, ఇప్పుడు మళ్లీ క్రిమినల్ సుఖేష్ ను పావుగా వాడుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని, బిఆర్ఎస్ పార్టీని, కెసిఆర్ కుటుంబాన్ని బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నారని కవిత మండిపడ్డారు.

 kavitha

దున్నపోతు ఈనిందంటే దూడను కట్టెయ్యమన్న చందంగా అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు పరిస్థితి తయారయిందని మీడియా సంస్థల తీరుపై మండిపడ్డారు. రాజకీయ అజెండాలో మీడియా సంస్థలు పావుగా మారడం, దిగజారి వార్తలు ప్రసారం చేయడం తెలంగాణ సమాజం గ్రహించాలని, జాగ్రత్త వహించాలని అన్నారు కవిత.

తెలంగాణ ప్రజలు విజ్ఞులని పాలేంటో నీలేంటో తెలిసిన చైతన్య జీవులని పేర్కొన్నారు. నామీద బురదజల్లే వార్తలకు అగ్ర ప్రాధాన్యత ఇచ్చిన మీడియా సంస్థలు దమ్ముంటే, నిజాయితీ ఉంటే తన వివరణ కూడా ఇవ్వాలని కవిత పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డలం తలవంచమని, తెగించి కొట్లాడుతామని జై తెలంగాణ అంటూ కవిత తన వివరణను ముగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+