కేసీఆర్ ను విరాట్ కోహ్లీతో పోలుస్తూ కవిత ట్వీట్.. కాంగ్రెస్ అదిరిపోయే కౌంటర్!!
తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిని ఒకరు టార్గెట్ చేస్తూ మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే రచ్చ కొనసాగుతుంది. సోషల్ మీడియాలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోరు హోరాహోరీగా సాగుతుంది.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వరల్డ్ కప్ 2023 లో నిన్న భారత్ రికార్డును సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించారు. ఆ ట్వీట్ లో కవిత విరాట్ కోహ్లీ ని తెలంగాణా సీఎం కేసీఆర్ తో పోల్చారు. కేసీఆర్ లాగే విరాట్ కూడా అన్ బీటబుల్ అంటూ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు కవిత.

ఇద్దరు మాస్టర్స్ ఫీల్డ్స్ లో ఉంటే మ్యాజిక్ హ్యాపెన్స్.. వారి వారి ఫీల్డ్ లో మ్యాజిక్ చెయ్యగలిగిన వాళ్ళు అంటూ కవిత ట్వీట్ చేశారు. ఇక కవిత చేసిన ట్వీట్ కి కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కవిత కు కౌంటర్ వేసిన కాంగ్రెస్ పార్టీ క్రికెట్ లో కోహ్లీకి తిరుగులేదు. కాళేశ్వరం కుంభకోణంలో కేసీఆర్ ను మించిన వాడు లేడని ఎక్స్ లో కవిత ట్వీట్ ను జత చేసి ఎక్స్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ పెడుతున్న ప్రతీ పోస్ట్ కు ఎప్పటికప్పుడు కౌంటర్లు రెడీ చేసుకుంటూ కాంగ్రెస్ సోషల్ మీడియాలో కూడా ధీటుగా తలపడుతుంది. అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యాలను, కేసీఆర్ అవినీతి పాలనను టార్గెట్ చేస్తుంది. ఇక బీఆర్ఎస్ ప్రచారానికి ఉపయోగిస్తున్న పాటలను కూడా టార్గెట్ చేస్తూ సెటైరికల్ పాటలు చేస్తుంది కాంగ్రెస్.
మొత్తంగా ఏ చిన్న అవకాశాన్ని అయినా తమ పబ్లిసిటీ కోసం బీఆర్ఎస్ వాడుకునే ప్రయత్నం చేస్తుంటే, ఏ చిన్న సందర్భం దొరికినా బీఆర్ఎస్ కు కౌంటర్ వేసే ప్రయత్నంలో, కేసీఆర్ ఫ్యామిలీ పరువు తీసే పనిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. మరి సోషల్ మీడియా వేదికగా కొనసాగుతున్న ఈ వార్ లో పై చెయ్యి ఎవరిది? ఈ ఎన్నికల్లో విజయం ఎవరిది? అనేది చూడాల్సిందే.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications