మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం సాధించే దాకా పోరాటం ఆగదు: ఢిల్లీ దీక్షలో కవిత!!

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం జంతర్ మంతర్ దగ్గర నేడు దీక్ష, ధర్నా నిర్వహిస్తున్నారు. మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం సాధించే దాకా పోరాటం చేస్తామన్నారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు సాధించేవరకు పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం దక్కాలని పేర్కొన్న కవిత దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద ఈరోజు దీక్ష కొనసాగించారు. ఉదయం 10 గంటలకు భారత జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ప్రారంభించిన నిరాహార దీక్షను సిపిఐ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది ప్రారంభించారు.

మహిళా బిల్లు ఒక చారిత్రాత్మక అవసరం: కవిత

మహిళా బిల్లు ఒక చారిత్రాత్మక అవసరం: కవిత

ఒకరోజు నిరాహార దీక్షను చేపట్టిన కవిత మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ పార్లమెంటు సమావేశాలలో ప్రవేశపెట్టి ఆమోదించాలని కవిత కేంద్రాన్ని డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ లో మొదలైన పోరాటం దేశమంతా వ్యాపించాలని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళా బిల్లు ఒక చారిత్రక అవసరమని పేర్కొన్న ఆమె దానిని కచ్చితంగా సాధించి తీరాలన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలన్న డిమాండ్ తో చేస్తున్న పోరాటం డిమాండ్ ను సాధించే వరకు కొనసాగుతుందన్నారు.

రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం దక్కాలి

రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం దక్కాలి

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతు తెలుపుతాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. భారత సంస్కృతిలో మహిళలకు పెద్దపీట వేశారని పేర్కొన్న కవిత, మహిళలను గౌరవించడం మన సంప్రదాయం అంటూ తేల్చి చెప్పారు. సహజంగా మనం పిలిచేటప్పుడు కూడా అమ్మానాన్న అని పిలుస్తామని, అందులో కూడా అమ్మ అనే శబ్దమే ముందు ఉంటుందని కవిత పేర్కొన్నారు. రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం దక్కాల్సిన అవసరం ఉందని పేర్కొన్న ఆమె, మహిళా రిజర్వేషన్ బిల్లు చాలాకాలంగా పార్లమెంట్లో పెండింగ్లో ఉందని గుర్తు చేశారు.

అవకాశాల్లో సగం కావాలన్న కవిత

అవకాశాల్లో సగం కావాలన్న కవిత


దేశంలోని మహిళలు అందరినీ కలుపుకొని మహిళా రిజర్వేషన్ సాధించేవరకు పోరాటం చేస్తామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. అవనిలో సగం ఆకాశంలో సగం అనే తెలుగు నానుడి ఉందని, అందుకే అవకాశాల్లోనూ సగం కావాలని కోరుతున్నామంటూ ఎమ్మెల్సీ కవిత ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీక్షకు మద్దతు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన కవిత మహిళా రిజర్వేషన్ బిల్లు సాధన కోసం మహిళలందరూ ఏకతాటి మీదికి రావాలని పిలుపునిచ్చారు.

బీజేపీ బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయి

బీజేపీ బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయి


1996లో నాటి ప్రధాని దేవగౌడ హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టినా ఇంకా చట్టం కాలేదని, ప్రస్తుతం పార్లమెంటులో బిజెపి ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉన్న నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లు పెడితే అన్ని పార్టీలు కూడా మద్దతు తెలుపుతాయని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. ఈరోజు కవిత చేస్తున్న పోరాటానికి 18 పార్టీలు సంఘీభావం పలకగా, బీఆర్ఎస్ మంత్రులు, బి ఆర్ ఎస్ నేతలు దేశ రాజధాని ఢిల్లీలో కవితతో పాటు ఆందోళనలో పాల్గొన్నారు. 5000 మందితో నేడు కవిత నిర్వహిస్తున్న ఈ దీక్ష మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి కొనసాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+