ఈడీ ఉచ్చు బిగుస్తున్నా.. కడిగిన ముత్యంలా బయటికి వస్తానన్న ఎమ్మెల్సీ కవిత!!
దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టయి ప్రస్తుతం ఈడీ విచారణ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణం నుంచి బయటపడే పరిస్థితులు కనిపించడం లేదు. రోజురోజుకు ఆమెపైన ఈడి ఉచ్చు బిగిస్తున్నట్టు కనిపిస్తుంది. ఏ కోర్టుకు వెళ్లిన కవితకు చుక్కెదురే అవుతోంది.
అయినప్పటికీ కవిత తాను కడిగిన ముత్యాల బయటకు వస్తానని, ఈడీ తనను కావాలని ఈ రాజకీయ కేసులో ఇరికించింది అని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు ఈడి కస్టడీ ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ప్రవేశ పెట్టేటప్పుడు కోర్టు ప్రాంగణంలో మీడియాను ఉద్దేశించి మాట్లాడిన కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను ఎలాంటి తప్పు చేయలేదని, కడిగిన ముత్యంలా తాను బయటకు వస్తానంటూ కవిత పేర్కొన్నారు. తనపై పెట్టింది మనీలాండరింగ్ కేస్ కాదని, ఇది పొలిటికల్ ల్యాండరింగ్ కేసు అంటూ కవిత వ్యాఖ్యానించారు. తాత్కాలికంగా తనను జైల్లో పెడతారేమో కానీ తన ఆత్మస్థైర్యాన్ని మాత్రం ఏ మాత్రం దెబ్బ తీయలేరని కవిత స్పష్టం చేశారు.
అంతేకాదు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత ఈ కేసులో ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరారని, మరో నిందితుడికి బిజెపి టికెట్ ఇచ్చిందని పేర్కొన్నారు. ఇక మూడో నిందితుడు బిజెపికి 50 కోట్ల రూపాయల ఎన్నికల బాండ్ల రూపంలో విరాళంగా ఇచ్చాడని కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో తాను అప్రూవర్ గా మారేది లేదని ఆమె తేల్చి చెప్పారు.
ఇది తప్పుడు కేసని, క్లీన్ గా బయటకు వస్తానని జై తెలంగాణ అంటూ కవిత నినాదాలు చేస్తూ కోర్టు హాల్లోకి వెళ్లారు. ఇక మరోవైపు కూడా కోర్టు ప్రాంగణంలో తెలంగాణ అంటూ కవితకు మద్దతుగా నినాదాలు చేస్తూ కనిపించారు. ఇదిలా ఉంటే ఈడి కస్టడీ ముగిసిన తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టిన కవితను కోర్టు రిమాండ్ కు తరలించాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో కవితను తీహార్ జైలుకు అధికారులు తరలించనున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications