కాంగ్రెస్ ది కుటుంబ అనుబంధం కాదు.. విద్రోహ సంబంధం: ఎమ్మెల్సీ కవిత!!

తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తూ పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భారీ బహిరంగ సభలలో పాల్గొంటూ రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలోని కుటుంబ పాలనను టార్గెట్ చేస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రజలలో సెంటిమెంట్ ను పండించే ప్రయత్నం చేస్తున్నారు.

సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఎన్నో కష్టాలకు ఓర్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు ఇవ్వలేరా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంతో తమకు ఉన్నది రాజకీయ సంబంధం కాదని కుటుంబ అనుబంధం అని ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు.

mlc kavitha slams rahul gandhi comments on family relationship with telangana

ఈరోజు మెట్పల్లిలో మీడియాతో మాట్లాడిన కవిత రాహుల్ గాంధీ తో పాటు, కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని టార్గెట్ చేశారు. రాహుల్ గాంధీ తన స్క్రిప్ట్ రైటర్ను మార్చుకోవాలని హితవు పలికిన కవిత తెలంగాణతో కాంగ్రెస్ పార్టీకి కుటుంబ అనుబంధం కాదు విద్రోహ అనుబంధం ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని కవిత విరుచుకుపడ్డారు. తెలంగాణలో బీసీ గణన చేయాలని రాహుల్ గాంధీ చెబుతున్నారని, ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని కవిత ఎద్దేవా చేశారు.నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ కాంగ్రెస్ పార్టీ హయాంలో పెట్టారని చెబుతున్నారని, అయితే నిజాం రాజుల పాలనలో నిజాం షుగర్స్ పెట్టారని గుర్తు చేసిన కవిత, రాహుల్ గాంధీ కొంచెం కూడా అవగాహన లేకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.

ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు తెలంగాణకు అనుబంధం ఉందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కవిత పేర్కొన్నారు.కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పై విరుచుకుపడిన కవిత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన పెద్దరికాన్ని మరిచి బతుకమ్మ పై కామెంట్లు చేశారని , తనను ఎలిజిబెత్ రాణి అని మాట్లాడి పెద్దరికాన్ని కోల్పోయారని మండిపడ్డారు.

కుటుంబ రాజకీయాల గురించి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడటం హాస్యాస్పదమని పేర్కొన్న కవిత, తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని కవిత ఎద్దేవ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+