MLC Kavitha: బెయిల్ కోసం కవితకు మళ్ళీ ఎదురుచూపులే; అప్పటివరకు టెన్షన్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ దొరుకుతుందని భావిస్తే బెయిల్ దొరికేలా కనిపించటం లేదు. బెయిల్ కోసం ఆమె కోర్టులను ఆశ్రయిస్తున్నా, కోర్టులలో ఆమెకు వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇక తాజాగా సీబీఐ కేసులో బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్న కవిత బెయిల్ పిటీషన్ పై ఇప్పటికే వాదనలు పూర్తి కాగా, నేడు తీర్పు రావలసి ఉంది.
కవిత బెయిల్ పిటీషన్ పై తీర్పు మళ్ళీ వాయిదా
నేడు కవిత బెయిల్ పిటీషన్ పై తీర్పు వెలువరించనున్నట్టు గత విచారణలో తెలిపిన రౌస్ అవెన్యూ కోర్టు నేడు తీర్పును మళ్ళీ వాయిదా వేయటంతో కవితకు నిరాశ ఎదురైంది. ఈడీ, సీబీఐ కేసుల్లో తీర్పులను మే 6వ తేదీన ఇస్తామని వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మార్చి 15న ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. ఢిల్లీ కోర్టు కస్టడీ విధించటంతో కవితను తీహార్ జైలుకు పంపారు.

ఈడీ, సీబీఐ కేసుల ఉచ్చులో కవిత
ఇక ఈడీ అరెస్ట్ అక్రమమని కోర్టులో పోరాటం చేసిన కవిత పిటీషన్లను కోర్టులు కొట్టివేశాయి. దీంతో కవిత బెయిల్ కోసం ప్రయత్నం చేశారు. మొదట మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నం చేసిన కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురు కాగా, సాధారణ బెయిల్ కోసం అప్పటి నుండి పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ మనీలాండరింగ్ ఆరోపణలతో విచారణ జరుపుతుంటే, సీబీఐ అవినీతిపై రంగంలోకి దిగింది.
కవిత కేసులో జరుగుతుందిదే
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు మళ్ళీ పిడుగుపాటులా సీబీఐ కూడా రంగంలోకి దిగి కవితను అరెస్ట్ చేసి ఆమెను విచారించింది. కవిత సీబీఐ కేసులో కూడా బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని, అక్రమంగా అరెస్ట్ చేశారని, ఇది కక్ష సాధింపు చర్యలో భాగంగానే జరిగిందని కవిత పదేపదే చెప్పారు. దీంతో కోర్టు కవితను మీడియాతో మాట్లాడొద్దని ఆదేశించింది.
బెయిల్ పిటీషన్ పై తీర్పు కోసం నిరీక్షణ
ఇక రెండు కేసుల్లోనూ బెయిల్ పిటీషన్ పై వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నేడు ఈడీ కేసులో తీర్పు ఇస్తారని భావిస్తే మళ్ళీ కోర్టు తీర్పును వాయిదా వేసింది. దీంతో మళ్ళీ కవితకు బెయిల్ విషయంలో నిరీక్షణ తప్పటం లేదు. మే ఆరు వరకు కవిత బెయిల్ పిటీషన్ పై తీర్పు కోసం ఎదురు చూడాలి.
బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన
ఇక తెలంగాణా రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ ప్రజా క్షేత్రంలోకి వెళ్తున్న వేళ కవిత కేసు వీరికి పెద్ద తలనొప్పిగా మారింది. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తుందని భావిస్తే బెయిల్ రాకపోవటం బీఆర్ఎస్ శ్రేణులకు ఆందోళన కలిగిస్తుంది. ఇక రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications