నేడు ప్రధాని చేతులమీదుగా హైదరాబాద్‌లో MMTS రైల్వే లైన్ ప్రారంభం...
భాగ్యనగరవాసులకు శుభవార్త.. నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతులమీదుగా భాగ్యనగరంలో కొత్త ఎంఎంటీఎస్ ట్రైన్ లైన్లు ప్రారంభం కానున్నాయి. ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న లింగంపల్లి - ఘట్‌కేసర్ ఎంఎంటీఎస్ సర్వీసులను నేడు ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. వాటిలో లింగంపల్లి - ఘట్‌కేసర్ ఎంఎంటీఎస్ సర్వీసులు కూడా ఉన్నాయి. ఈ ఎంఎంటీఎస్ ట్రైన్ల ప్రారంభంతో ఐటీ ఉద్యోగులకు ప్రయాణం సులభతరం, సౌకర్యవంతం కానుంది. నగరానికి తూర్పు, పడమరలో ఉన్న ఐటీ కారిడార్‌లను కలుపుతూ లింగంపల్లి - ఘట్‌కేసర్ మధ్య ఎంఎంటీఎస్ పరుగులు తీయనుంది. ఈ ఎంఎంటీఎస్ ట్రైన్లు సికింద్రాబాద్‌ను బైపాస్ చేస్తూ లింగంపల్లి - సనత్‌నగర్ - మౌలాలి - చర్లపల్లి - ఘట్‌కేసర్ మార్గంలో ప్రయాణించనున్నాయి. ప్రధానమంత్రి నేడు 04730 నంబరు ఎంఎంటీఎస్ ట్రైనును ఘట్‌కేసర్ నుంచి ఉదయం 10.45 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ ట్రైన్‌ణ 11 ఎంఎంటీఎస్ స్టేషన్ల మీదుగా లింగంపల్లికి 12.40 గంటలకు చేరుకోబోతుంది. ఈ ట్రైన్ల టిక్కెట్ల ధర కేవలం ఐదు రూపాయలు మాత్రమే.

రూ. 343 కోట్ల వ్యయంతో ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ...:
తెలంగాణ రాష్ట్రం రెండో రోజు పర్యటనలో భాగంగా ప్రధాని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ప్రారంభించిన వివిధ కార్యక్రమాలతో పాటు సనత్‌నగర్ - మౌలాలి మధ్య నిర్మించిన ఆరు కొత్త స్టేషన్ భవనాలనూ కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. సనత్‌నగర్ - మౌలాలి మధ్య రెండో రైల్వే లైనును కూడా అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతుంది. ప్రధాని ప్రారంభించబోతున్న ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థకు రూ. 343 కోట్ల వ్యయం ఖర్చపెట్టారు. ఇది సుమారు 22 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. వీటితో పాటు ఫిరోజ్‌గూడ, సుచిత్రసెంటర్, భూదేవినగర్, అమ్ముగూడ, నేరేడ్‌మెట్, మౌలాలి హౌసింగ్ బోర్డ్ స్టేషన్లలో కొత్త భవనాలను దక్షిణ సెంట్రల్ రైల్వే నిర్మించింది. కొత్తగా ప్రారంభం కానున్న ఎంఎంటీఎస్ ట్రైన్లతో నగర వాసులకు ప్రయాణ కష్టాలు తప్పనున్నాయి.












Click it and Unblock the Notifications