తెలంగాణకు మోడీ సర్కారు గుడ్‌న్యూస్
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. విభజన హామీలలో మరో హామీని నరేంద్ర మోడీ సర్కారు నెరవేర్చింది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం అక్కడున్న ఓవర్ హాలింగ్ వర్క్‌షాప్‌ను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అప్‌గ్రేడ్ చేయాలని గత సంవత్సరం జులై 5న దక్షిణ మధ్య రైల్వే జీఎంకి రైల్వే బోర్డు లేఖ రాసింది. యూనిట్‌ని అభివృద్ధి చేయాలని ఈ ఏడాది సెప్టెంబర్ 9న రైల్వే బోర్డు ఆదేశాలిచ్చింది.

కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో ఎల్‌హెచ్‌బీ, ఈఎంయూ కోచ్‌ల తయారీకి సౌకర్యాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని రైల్వే బోర్డ్ సూచించింది. విభజన హామీల అమలుపై తెలంగాణ అధికారులు కేంద్ర అధికారులతో హోంశాఖ నిర్వహించిన భేటీలో ఈ విషయం వెల్లడి కావడం గమనార్హం.
కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కాజీపేట రైల్వే కోచ్ డిమాండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాజీపేటలో రైల్వే కోచ్ ఏర్పాటు చేసి కేంద్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీల నేతలు కోరాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కాజీపేటలో రైల్వే కోచ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications