మోజో టీవీ సీఈవోకు నోటీసులు అందించిన పోలీసులు..
టీవీ9 రవి ప్రకాశ్ ఎఫెక్ట్ మోజో టీవీపై పడిందా..ఆయన భాగస్వామ్యంలో నడుస్తున్న మోజో టీవీ సీఈవో నోటీసులు అందుకుంది. కొద్ది రోజుల క్రితం కేరళలో అయ్యప్ప స్వామీ దర్శనానికి మహిళలు ప్రవేశించే విషయంపై మోజో టీవీలో చర్చలో భాగంగా ఒక దళితున్ని ఆహ్వనించి అవమానించారనే ఆరోపణలపై కేసు నమోదైనట్టు తెలుస్తోంది.

దీంతో మోజో టీవీ సీఈవో రేవతితోపాటు యాంకర్ రఘులపై ఎస్పీ,ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు కావడంతో వారికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. .ఇందులో భాగంగానే వారికి నోటీసులు పంపారు. కాగా కేసుల నిమిత్తం పోలీసులు విచారణ చేపట్టనున్నారు.












Click it and Unblock the Notifications