కారు ఇంజన్లో మంటలు.. చూస్తే డబ్బుల కట్టలు.. సినీ ఫక్కీలో ఏం జరిగిందంటే!!

ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికలు కొనసాగుతున్న వేళ ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న రాజకీయ పార్టీల నేతలు గుట్టు చప్పుడు కాకుండా డబ్బులను తరలిస్తున్నారు. ఇక తాజాగా అటువంటి ఘటన వరంగల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

ఎన్నికల కోడ్ నేపథ్యంలో డబ్బులు ఇచ్చి ఓటర్లను ప్రలోభ పెడతారని ఎన్నికల అధికారులు, పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహన తనిఖీలు జరిపి నగదును పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో పోలీసులకు దొరకకుండా ఉండేందుకు రకరకాల ప్లాన్లు వేస్తున్న వివిధ పార్టీల నాయకులు ఎవరికి అర్థం కాని విధంగా డబ్బులను తరలించే ప్రయత్నం చేస్తున్నారు.

Money caught fire in the car engine in warangal district!!

ఇక తాజాగా కార్ ఇంజన్ లో డబ్బులు పెట్టి తరలించే క్రమంలో, కార్ ఇంజన్ వేడి కావడంతో డబ్బులకు మంటలు అంటుకున్నాయి. వరంగల్ జిల్లా ఖిల్లా వరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి కళాశాల ముందు ఈ ఘటన జరిగింది. దీంతో ఒక్కసారిగా ఇంజన్లో నుండి పొగలు రావడంతో భయపడి పోయిన సదరు వాహనంలోని వారు, ఈ వాహనానికి ఎస్కార్ట్ గా వచ్చిన వేరే వాహనంలోకి డబ్బును తరలించేశారు.

ఇక కారులో మంటలను చూసిన స్థానికులు, అక్కడ సమీపంలో ఉన్న కళాశాల విద్యార్థులు మంటలు ఆర్పేందుకు వచ్చి, అక్కడ నోట్ల కట్టలు కనిపించడంతో చేతికి అందినంత డబ్బులు లాక్కుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే అందులో దాదాపు 25 లక్షల రూపాయలు ఉన్నాయని చెబుతున్నా, కాదు అందులో ఇంకా ఎక్కువ మొత్తంలోనే నగదు ఉందని అక్కడ చూసిన వారంతా గుసగుసలాడుతున్నారు .

అయితే విషయం తెలిసి ఘటన స్థలానికి పోలీసులు చేరుకునే సమయానికి డబ్బులను మాయం చేశారు. అయితే పోలీసులు ఈ కారు ఎవరిది? ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడికి వెళుతుంది? ఏ పార్టీకి సంబంధించింది? అని వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మంటలు ఆర్పిన కారును పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అయితే ఇదంతా సినీ ఫక్కీలో జరిగిందని భావిస్తున్నారు. ఇక ఈ ఘటన జరిగిన స్థలాన్ని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ పరిశీలించారు. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+