Mothers Day 2025: అమ్మ మీద ప్రేమ వ్యక్తం చేయండిలా... హ్యాపీ మదర్స్ డే!
సృష్టికి మూలం అమ్మ. సృష్టికర్త అయిన బ్రహ్మని కూడా సృష్టించింది అమ్మే అని చెబుతారు. అటువంటి అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మ ఓ అమృతమయి. సృష్టిలో ఉన్న అన్ని సంబంధాలలోనూ నిష్కల్మషమైనది, ప్రేమకు ప్రతిరూపంగా నిలిచేది తల్లి బిడ్డల బంధమే. కన్న బిడ్డల కోసం ఎండనక, వాననక కష్టించి పనిచేసే వారి జీవితాలకు పూల బాటలు వేసిన తల్లులు ఎందరో.
అమ్మ్మల కోసం ప్రత్యేకమైన రోజు మదర్స్ డే
అటువంటి తల్లులను గురించి గుర్తు చేసుకునేది, అమ్మతనాన్ని అపురూపంగా జరుపుకునే ప్రత్యేకమైన రోజు మదర్స్ డే. ఇంటర్నేషనల్ మదర్స్ డే సందర్భంగా వన్ ఇండియా అందిస్తున్న ఈ ప్రత్యేక కథనం. త్యాగమూర్తులు అయిన తల్లుల కోసం, ఆ తల్లులను ప్రేమించే పిల్లల కోసం.

తల్లిని నిరాదరణకు గురి చేస్తున్న పిల్లలు
ప్రతి తల్లి తన పిల్లల పట్ల అంతులేని ప్రేమను కనబరుస్తుంది. బిడ్డ పుట్టినప్పటినుంచి పెరిగి పెద్దదయ్యే వరకు మాత్రమే కాదు, వాళ్లకు పెళ్లిళ్ళు, వాళ్ల పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నా సరే తల్లికి తమ పిల్లలు ఇంకా చిన్నపిల్లలుగానే కనిపిస్తారు. బ్రతికున్నంత కాలం వాళ్ళ మీద పరిపూర్ణమైన ప్రేమను చూపించేది తల్లి మాత్రమే. బిడ్డలకు చిన్నకష్టం వచ్చిందన్నా సరే తల్లి విలవిలలాడుతుంది. అటువంటి తల్లిని ఈరోజు చాలామంది నిర్దాక్షిణ్యంగా నిరాదరణకు గురిచేస్తున్నారు.
అమ్మ పట్ల ఉండాల్సింది ఇదే
తమను కని, పెంచి పెద్ద చేసిన తల్లిని వృద్ధాప్యం వచ్చిన తర్వాత చూడాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఇక అమ్మ గొప్పతనం గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, మదర్స్ డే వంటి రోజులు వచ్చినప్పుడే గుర్తు చేసుకోవడం కూడా ప్రధానంగా చూస్తున్నాం. అయితే ప్రత్యేకమైన రోజుల్లోనే కాదు ప్రతిరోజు అమ్మ పట్ల కాస్తంత శ్రద్ధ ఉంటే చాలు ఆ తల్లి చాలా సంతోషిస్తుంది.
అమ్మకు ఇది ఇవ్వండి చాలు
వయసు మీద పడిన తర్వాత తల్లి పిల్లలనుంచి కోరుకునేది కాసింత ప్రేమ. ఆ ప్రేమను అందించగలిగితే ఆమె చాలా సంతోషంగా జీవించగలుగుతారు. ఎంతో సాధించాం ఎంతో ఎదిగాం అని చెప్పుకునే ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మ పాత్ర గణనీయమైనది. తల్లి పిల్లల విజయంలో కీలక భూమిక పోషిస్తుంది. నిస్వార్థమైన సహకారాన్ని అందిస్తుంది. అటువంటి అమ్మను ఒక్క మదర్స్ డే రోజు మాత్రమే కాదు ప్రతిరోజు ప్రేమగానే చూడాల్సిన అవసరం ఉంది.
ప్రతీరోజూ అమ్మ రోజే
ప్రపంచంలోని అనేక దేశాలలో మనల్ని కని పెంచి పెద్ద చేసిన తల్లికి కృతజ్ఞతలు తెలియజేయడానికి మదర్స్ డే జరుపుకుంటారు. విదేశాలలో మన భారతీయ సంస్కృతిలో ఉండే కుటుంబవ్యవస్థ లాంటి వ్యవస్థ లేదు కాబట్టి మదర్స్ డేని ప్రత్యేకంగా నిర్వహించుకుంటారు. కానీ భారతీయ సంస్కృతి చాలా ప్రత్యేకమైనది. భారతీయ సంస్కృతిలో తల్లి పాత్ర చాలా ముఖ్యమైంది. కనుక మన సంస్కృతిలో ప్రతీరోజూ అమ్మదే.
అమ్మ మీద ప్రేమ బహుమతులతో కాదు, ఇలా చూపించాలి
ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే రెండో ఆదివారం ప్రపంచవ్యాప్తంగా మదర్స్ దడే జరుపుకుంటారు. మన భారతదేశంలో కూడా మే నెలలో వచ్చే రెండో ఆదివారాన్ని మదర్స్ డే గా జరుపుకుంటాం. ఇక నేడు మదర్స్ డే సందర్భంగా బహుమతులు ఇచ్చి, విలువైన వస్తువులు ఇచ్చి అమ్మ పట్ల ప్రేమ చూపించే వారున్నారు. అయితే వారంతా ఒక్కరోజే కాదు ప్రతీ రోజూ అమ్మదే అనే విషయం గుర్తు పెట్టుకోవాలి.
అమ్మ సంతోషంగా ఫీల్ అవ్వాలంటే ఇలా చెయ్యండి
అమ్మను ప్రేమగా పలకరించి, ఆమె చిన్న చిన్న అవసరాలు తీరిస్తే అదే అమ్మకు పండుగ రోజు. వయసు మీద పడిన తర్వాత వృద్ధాశ్రమాలకు అమ్మలను పరిమితం చెయ్యకుండా అమ్మను ప్రేమగా చూసుకోవాలి. అమ్మకు చిన్న చిన్న పనులలో చేదోడు వాదోడుగా ఉండటం, మీవంతు కాస్త సహనంతో అమ్మతో ప్రవర్తించటంతో పాటు ఆమె అవసరాలు తీరిస్తే చాలు.. అమ్మ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది.అమ్మ సంతోషంగా ఉన్నరోజే నిజమైన మదర్స్ డే.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications