లోకేష్‌పై ఆధారాలు లేకుంటే బట్టలూడదీసి కొడతారు: పవన్‌పై మోత్కుపల్లి
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు గురువారం మండిపడ్డారు. ఎంత ప్యాకేజీకి అమ్ముడుపోయారో చెప్పాలని ప్రశ్నించారు.
తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పైన, ఏపీ మంత్రి నారా లోకేశ్ పైన విమర్శలు సరికాదన్నారు. చంద్రబాబుని గొప్ప నేతగా మొన్నటి వరకు ప్రశంసించిన పవన్ హఠాత్తుగా మాట మార్చడం వెనుక కారణం ఏమిటన్నారు.

పవన్.. ఎంత ప్యాకేజీకు అమ్ముడు పోయావు? లోకేశ్ పైన చేసిన ఆరోపణలకు ఆధారాలున్నాయా అని నిలదీశారు. లోకేశ్ పైన చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు కనుక లేకపోతే బట్టలూడదీసి మరి ప్రజలు కొడతారంటూ పవన్‌ని హెచ్చరించారు. నాడు ప్రజారాజ్యం పార్టీ పేరిట టికెట్టు అమ్ముకున్న మీరా నీతులు చెప్పేదని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications