'పార్టీ దూసుకురావడం ఖాయం, టీడీపీని పక్కాప్లాన్‌తో వాడుకున్న రేవంత్ రెడ్డి'
హైదరాబాద్: విభజన నేపథ్యంలో నవ్యాంధ్రపై ఏపీ సీఎం, తమ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దృష్టి పెడుతున్నారని, కొన్నాళ్ల తర్వాత తెలంగాణ వైపు చూస్తారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.
చదవండి: బాబు అలా చేసి ఉండాల్సింది కాదు: రేవంత్‌పై మోత్కుపల్లి షాకింగ్, గవర్నర్ ఆశలు వదిలేశా
2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము ఎవరి వద్దకు పొత్తుల కోసం వెళ్లమని తేల్చి చెప్పారు. ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు అప్పుడే కసరత్తు చేస్తున్నాయని చెప్పారు. పొత్తుల కోసం ఏ పార్టీ అయినా తమ వద్దకే రావాలని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీడీపీని లేకుండా చేయాలని చాలామంది అనుకున్నారని, కానీ ఎవరి వల్ల కాదన్నారు. బాబు చేసిన అభివృద్ధి అందరికీ గుర్తు ఉందని, ఆయనపై ఆధారపడ్డ పార్టీ టీడీపీ అని, ఆయన ఏపీకి వెళ్లడంతో ఇబ్బంది వచ్చిందన్నారు.
చదవండి: రాజ్‌భవన్లో కేసీఆర్-పవన్ కళ్యాణ్ ఏకాంత చర్చ: బాబుతో ఆత్మీయంగా, సీఎంలతో చిరంజీవి ఇలా (ఫోటోలు)

ఏ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు
తమ వద్దకు ఎవరైనా వస్తే అప్పుడు మేం పొత్తులపై ఆలోచిస్తామని మోత్కుపల్లి చెప్పారు. రాష్ట్రంలో ఏ పార్టీ ఆధిక్యంలో లేదని చెప్పారు. 2019లో కాంగ్రెస్, తెరాస అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు.

నాయకుల కంటే అది ముఖ్యం
ఏ పార్టీలో అయినా ఎంతమంది నాయకులు ఉన్నారనే దాని కంటే ప్రజల్లో ఏ పార్టీకి ఆదరణ ఉన్నదనేది ముఖ్యమని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు లీడర్లు లేరని, కానీ తొమ్మిది నెలల్లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు.

టీడీపీ దూసుకు రావడం ఖాయం
అధికారంలో ఉన్న తెరాస అన్నింటి విఫలమైందని మోత్కుపల్లి ఆరోపించారు. కాంగ్రెస్ కుంభకోణాల పార్టీ అన్నారు. ఇలా రెండు పార్టీల నుంచి టీడీపీ దూసుకు రావడం ఖాయమనన్నారు. రానున్న ఒకటిన్నర సంవత్సరాల్లో టీడీపీ శక్తి ఏమిటో కాంగ్రెస్, తెరాసలతో పాటు రేవంత్ వంటి నేతలకు చూపిస్తామని అభిప్రాయపడ్డారు.

టీడీపీని పక్కా ప్లాన్‌తో వాడుకున్న రేవంత్
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లడం వల్ల టీడీపీకి ఎలాంటి నష్టం లేదని మోత్కుపల్లి అన్నారు. అసలు రేవంత్ ఎవరని ప్రశ్నించారు. రేవంత్ వెళ్లిపోవడం వల్ల టీడీపీ మూతపడదన్నారు. టీడీపీని పావుగా వాడుకొని ఆయన పక్కా ప్రణాళికతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారన్నారు.












Click it and Unblock the Notifications