రాజ్‌భవన్లో కేసీఆర్-పవన్ కళ్యాణ్ ఏకాంత చర్చ: బాబుతో ఆత్మీయంగా, సీఎంలతో చిరంజీవి ఇలా (ఫోటోలు)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు ఆయన గౌరవార్థం గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్‌లో ఆదివారం సాయంత్రం విందును ఏర్పాటు చేశారు.

చదవండి: నేనొస్తే వేరేలా: పవన్ హెచ్చరిక, ఇక్కడ పుట్టిన నీకు: రోజా ఘాటుగా, రంగంలోకి బండ్ల గణేష్!

ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ శాసన సభాపతి కోడెల శివప్రసాద రావు, తెలంగాణ మండలి చైర్మన్ స్వామి గౌడ్, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య తదితరులు హాజరయ్యారు.

పవన్ కళ్యాణ్, చిరు, రానా

పవన్ కళ్యాణ్, చిరు, రానా

టీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, తెలంగాణ కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత జానారెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్రమంత్రి సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితరులు హాజరయ్యారు. నటుడు రానా కూడా వచ్చారు.

తెలుగు రాష్ట్రాల నుంచి మరెందరో

తెలుగు రాష్ట్రాల నుంచి మరెందరో

ఈనాడు ఎండి కిరణ్, మార్గదర్శి ఎండి శైలజా కిరణ్, ఏపీ మంత్రులు చినరాజప్ప, ఏపీ మండలి చైర్మన్ ఫరూక్, జిహెచ్ఎంసి మేయర్ రామ్మోహన్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఏపీలు కేశవ రావు, బాల్క సుమన్, బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, రామచంద్ర రావు, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ, టి-డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఆత్మీయంగా మాట్లాడుకున్న బాబు-కేసీఆర్

ఆత్మీయంగా మాట్లాడుకున్న బాబు-కేసీఆర్

కోవింద్ గౌరవార్థం ఇచ్చిన విందులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు-కేసీఆర్‌లు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. కాసేపు వారు ఏకాంతంగా కూడా మాట్లాడారు.

పక్క పక్కనే చిరంజీవి, పవన్ కళ్యాణ్

పక్క పక్కనే చిరంజీవి, పవన్ కళ్యాణ్

ఈ విందులో కాంగ్రెస్ ఎంపీ, కేంద్రమాజీ మంత్రి చిరంజీవి, ఆయన సోదరుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు పక్క పక్కన కూర్చున్నారు.

ఏకాంతంగా పవన్ కళ్యాణ్, కేసీఆర్

ఏకాంతంగా పవన్ కళ్యాణ్, కేసీఆర్

విందుకు హాజరైన పవన్ కళ్యాణ్, కేసీఆర్‌లు కూడా పక్కపక్కనే, ఎదురెదురుగా నిలబడి కాసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఇరువురు కొద్దిసేపు ముచ్చటించుకోవడం ఆసక్తిని కలిగించింది. వీళ్లిద్దరు ఏం మాట్లాడుకున్నారా అనే ఆసక్తికర చర్చ సాగుతోంది.

కేసీఆర్‌తో చిరు మాట్లాడారు, ఆ తర్వాత చంద్రబాబు తోడు

కేసీఆర్‌తో చిరు మాట్లాడారు, ఆ తర్వాత చంద్రబాబు తోడు

ఈ విందులో కేసీఆర్‌ను చిరంజీవి కలిశారు. వారిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత చంద్రబాబును చిరంజీవి కలిశారు. ఆ తర్వాత కాసేపటికి చిరు-చంద్రబాబులకు కేసీఆర్ జత కలిశారు.

చాలా రోజుల తర్వాత కేసీఆర్-బాబు

చాలా రోజుల తర్వాత కేసీఆర్-బాబు

తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు - కేసీఆర్‌లు మరోసారి చాలా రోజుల తర్వాత కలిశారు. ఇరువురు కూడా రాజ్ భవన్‌లో నడుస్తూ మాట్లాడుకున్నారు.

చిరంజీవితో ప్రత్యేకంగా కేసీఆర్-బాబు

చిరంజీవితో ప్రత్యేకంగా కేసీఆర్-బాబు

చిరంజీవితో ఇరువురు సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గవర్నర్ నరసింహన్ జనసేనాని పవన్ కళ్యాణ్‌తో ముచ్చటించారు. ఈ విందులో పవన్-చిరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారితో ఫోటోలు దిగేందుకు అతిథులు ఉత్సాహం కనబరిచారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
President Ramnath Kovind arrives in Hyderabad for southern sojourn on Sunday. Pawan Kalyan, KCR, Chiranjeevi, Chandrababu Naidu in Governors dinner party.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి