నేనొస్తే వేరేలా: పవన్ హెచ్చరిక, ఇక్కడ పుట్టిన నీకు: రోజా ఘాటుగా, రంగంలోకి బండ్ల గణేష్!

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో మహిళపై జరిగిన దాడి ఘటన రాజకీయ రంగు పులుముకుంటోంది. మహిళను వివస్త్రను చేసిన ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. చర్యలు తీసుకోకుంటే తాను రంగంలోకి దిగవలసి ఉంటుందని, అప్పుడు అధికారులపై ఒత్తిడి పెరుగుతుందని హెచ్చరించారు.

  పవన్ కు రోజా ధీటైన కౌంటర్ !

  చదవండి: పవన్! అలా అనడం సరికాదు, వదిలిపెట్టేదిలేదు: నన్నపనేని, 'బురదజల్లుకోవద్దు'

  ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించిన తీరుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. పవన్ ఏదైనా సమస్యపై స్పందించినప్పుడు ఓ అంశాన్ని దొరకబుచ్చుకొని రోజా కౌంటర్ ఇస్తున్నారు. ఈ విషయంలోను ఆమె పవన్ తీరుపై విమర్శలు చేశారు.

  చదవండి: షాకింగ్: 'జగన్ పార్టీలో బిట్ కాయిన్ మోసగాడు, తమిళనాడులో కీలక నేత'

   బురద జల్లుకోకండి

  బురద జల్లుకోకండి

  పెందుర్తిలో నిస్సహాయురాలిపై కొందరు రాజకీయ నాయకులు క్రూరమైన దాడికి పాల్పడ్డారని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలు సమాధానం కోరుతున్నారని పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. టీడీపీ, బీజేపీ, వైసీపీలు ఈ అంశంలో ఒకరిపై మరొకరు బురదజల్లుకోకుండా ఒక్కతాటిపైకి రావాలని సూచించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా అసెంబ్లీలో చర్చించాలన్నారు.

  ఎవరైనా అది అన్యాయం

  ఎవరైనా అది అన్యాయం

  తనకు తెలిసిన సమాచారం మేరకు దాడికి పాల్పడింది తెలుగుదేశం పార్టీ వారేనని, తాను స్వయంగా జోక్యం చేసుకుంటే, విశాఖ వస్తే మరింత ఒత్తిడి పెరిగే అవకాశముందని, అందుకే ఆమెకు న్యాయం చేయాలని విజ్ఢప్తి చేస్తున్నానని పవన్ కోరారు. బాధిత మహిళ ఏ సామాజిక వర్గానికి చెందినప్పటికీ, కారణం ఏదైనా ఆమెపై దాడి సరికాదని, అన్యాయమని పవన్ పేర్కొన్నారు.

  ఎన్నారైల నుంచి సందేశాలు

  ఎన్నారైల నుంచి సందేశాలు

  అవే ట్వీట్లలో పవన్ కళ్యాణ్... బాధిత మహిళకు మద్దతుగా ఐరాపా, అమెరికా నుంచి చాలా మంది మహిళలు తనకు సందేశాలు పంపించారని పేర్కొన్నారు. ఎన్నారైల నుంచి తనకు పెద్ద ఎత్తున సందేశాలు వచ్చాయన్నారు.

  రోజా కౌంటర్

  రోజా కౌంటర్

  ఈ విషమయై రోజా ఘాటుగా స్పందించారు. 'ఎవరో యూరప్‌లో ఉన్న మహిళ నీకు మెసేజ్ చేసి సపోర్ట్ చేయమని అడిగే వరకు ఇక్కడ పుట్టిన నీకు ఒక ఆడపడుచుకు అవమానం జరిగింది అని తెలియకపోవడం సిగ్గుచేటు' అని ట్వీట్ చేశారు.

  బండ్ల గణేష్ ట్వీట్

  బండ్ల గణేష్ ట్వీట్

  మరోవైపు, పవన్ కళ్యాణ్ స్పందించిన తీరుపై నిర్మాత బండ్ల గణేష్ కూడా స్పందించారు. 'మాటల్లో నీతి.. కళ్లలో నిజాయితీ, గుండెల్లో పౌరుషం, రక్తంలో దమ్ము. మీ సొంతం బాస్.. అంటూ' పవన్ కళ్యాణ్‌ను ప్రశంసించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The controversial Pendurthi land issue in Visakhapatnam has become the subject of hot political discussion in Andhra Pradesh. It is alleged that a helpless woman was assaulted reportedly by the people belonging to TDP cadre.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి