Indigo: ప్రయాణికులకు ఇండిగో బిగ్ షాక్..! రేపటి నుంచి ఛార్జీల పెంపు ఇలా..!
ఇరాన్ (IRAN) వార్ ప్రభావం ఇప్పుడు దేశంలోని అన్ని రంగాలపై కనిపిస్తోంది. ఇందుకు విమానయాన రంగం కూడా మినహాయింపు కాదు. పశ్చిమాసియా యుద్ద పరిస్ధితుల కారణంగా పెరుగుతున్న ఇంధన ధరలతో విమాన ప్రయాణ టికెట్ల ధరల్ని కూడా ఎయిర్ లైన్ సంస్థలు పెంచేస్తున్నాయి. ఇందులో ఎయిర్ ఇండియా ముందుంది. ఇప్పటికే తమ విమాన టికెట్లపై ఇంధన సర్ ఛార్జ్ పేరుతో ఎయిరిండియా రేట్లు పెంచేయగా.. ఇప్పుడు ఇండిగో (indigo) కూడా అదే బాట పట్టింది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా ఇంధన ధరలు గణనీయంగా పెరిగాయని పేర్కొంటూ.. మార్చి 14 శనివారం నుండి దేశీయ, అంతర్జాతీయ విమానాలపై ఇంధన సర్‌ఛార్జ్‌ను అమలు చేయనున్నట్లు ఇండిగో ప్రకటించింది.
అంతర్జాతీయ వాయు రవాణా సంఘం జెట్ ఇంధన మానిటర్ వివాదం కారణంగా ఈ ప్రాంతానికి ఇంధన ధరలు 85% కంటే ఎక్కువ పెరిగాయని తెలిపినట్లు ఎయిర్‌లైన్ వెల్లడించింది.

ఈ ఆకస్మిక పెరుగుదల ఇండిగోతో సహా అన్ని విమానయాన సంస్థల ఖర్చుల, నెట్‌వర్క్‌లపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంది. ఈ ఇంధన ధరల పెరుగుదల మొత్తం ప్రభావాన్ని భర్తీ చేయడానికి ఛార్జీలకు చాలా గణనీయమైన సర్దుబాటు అవసరం అయినప్పటికీ, వినియోగదారులపై పర్యవసానంగా కలిగే భారాన్ని దృష్టిలో ఉంచుకుని ఇండిగో ఇంధన ఛార్జీగా సాపేక్షంగా తక్కువ మొత్తాన్ని పెంచుతున్నట్లు ఇండిగో చెప్పుకొచ్చింది. మార్చి 14 నుండి ఇండిగో విమానాలలో అన్ని కొత్త బుకింగ్‌ల కోసం అదనపు ఇంధన ఛార్జీ విధిస్తున్నారు. దేశీయ విమానాలకు రూ.425, భారత ఉపఖండంలో అయితే రూ. 425, మధ్యప్రాచ్యానికి వెళ్లే విమానాలకు రూ.900, ఆగ్నేయాసియా, చైనా వెళ్లే విమానాలకు రూ.1,800, ఆఫ్రికా,పశ్చిమ ఆసియా దేశాల విమానాలకు రూ.1,800, యూరప్ విమానాలకు రూ.2,300 ఇంధన సర్ ఛార్జీ విధిస్తున్నారు.
-
ట్రంప్ ఫోన్లు ఎత్తని ఇరాన్ ? ముందుకెళ్లని చర్చలకు 3 కారణాలు..! -
అమెరికా-ఇజ్రాయెల్ మధ్య విభేదాలు? వాన్స్-నెతన్యాహు సంచలన కాల్ లీక్..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
Bay of Pigs: క్యూబాలో అమెరికా ఎలా ఓడిపోయి లొంగిపోయింది ? నెక్ట్స్ ఇరానేనా ? -
భారత్‌కు ఇరాన్ బంపరాఫర్!.. ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
Lockdown: లాక్ డౌన్ ఎక్కడంటే ?- పార్లమెంట్ లో తేల్చేసిన ఆర్థికమంత్రి..! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications