పోలీసులకు షాకిచ్చిన వాహనదారుడు.. ఏకంగా 233 ట్రాఫిక్ పెండింగ్ చలాన్లు

సహజంగా వాహనదారులు బయటకు వెళితే ట్రాఫిక్ పోలీసులు నిబంధన పేర్లతో వాళ్లకు షాక్ ఇస్తున్నారు. హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఫైన్, సిగ్నల్ జంప్ చేస్తే ఫైన్, ఓవర్ స్పీడ్ లో డ్రైవ్ చేస్తే ఫైన్, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే ఫైన్, ట్రిపుల్ డ్రైవింగ్ వెళితే ఫైన్.. ఇలా ఒకటేమిటి... ఏ చిన్న తప్పు చేసినా ట్రాఫిక్ పోలీసుల కెమెరాలకు చిక్కి ఫైన్ వేయించుకుంటున్నారు వాహనదారులు.

పోలీసులకు షాక్ ఇచ్చిన వాహనదారుడు
అటువంటి ట్రాఫిక్ పోలీసులకే ఒక వాహనదారుడు షాక్ ఇచ్చాడు. ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఎవరు ఊహించని పెండింగ్ చలాన్ లతో దర్జాగా రోడ్డు మీద తిరుగుతున్నాడు.సాధారణంగా టూవీలర్ మీద బయటకు వెళ్లేవారు ఆర్సి , డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, హెల్మెట్ వంటి అన్ని నిబంధనలు పాటిస్తే వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు.

Motorist shocked the police 233 pending traffic challans on a scooty in hanamkonda

Take a Poll

ఒకే బండి మీద 233 ట్రాఫిక్ చలాన్లు
ఇక రోడ్డుమీదికి వెళ్ళిన తర్వాత కూడా ట్రాఫిక్ రూల్స్ ను సరిగ్గా పాటించిన వారు జరిమానాల బాధితులుగా మారరు. అయితే చాలామంది ట్రాఫిక్ రూల్స్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ట్రాఫిక్ ఫైన్స్ కడుతూ ఉంటారు. సహజంగా పదుల సంఖ్యలో ట్రాఫిక్ ఫైన్స్ కట్టే వాళ్లను మనం చూసుంటాం. కానీ ఒకే బండిమీద ఏకంగా 233 పెండింగ్ చలాన్లు ఉన్నాయి అంటే మనోడి ప్రతిభ ఏ పాటితో మనం అర్థం చేసుకోవచ్చు.

233 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్
వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కాజీపేట ట్రాఫిక్ ఇన్స్ స్పెక్టర్ వెంకన్న తన సిబ్బందితో కలసి కాజీపేట చౌరస్తాలో వాహన తనిఖీ చేసే సమయంలో హన్మకొండ ప్రాంతానికి చెందిన అస్లాం అనే వ్యక్తి వాహనానికి సంబంధించిపెండింగ్ చలాన్లు చెక్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. ఏకంగా 233 ట్రాఫిక్ చలాన్లను పెండింగ్ లో ఉన్నాయి. ఈ చలాన్లు మొత్తం 45,350/- రూపాయలు కావడంతో జరిమానా మొత్తం చెల్లించాలని వాహనదారుడికి సూచించారు.

జరిమానా చెల్లించి వాహనం తీసుకెళ్లమన్న పోలీసులు
2016 నుంచి ఇప్పటివరకు ఈ వాహనం పైన 233 ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉన్నట్టు గుర్తించారు. హెల్మెట్ లేకుండా నడిపినందుకు ఎక్కువ భాగం ట్రాఫిక్ ఉల్లంఘన కింద నమోదు అయినట్టుగా గుర్తించారు. ఈ స్కూటీ ఎక్కువగా కరీంనగర్, హైదరాబాద్, వరంగల్ లో తిరిగినట్టు పెండింగ్ చలాన్ల ద్వారా గుర్తించారు. ప్రస్తుతం వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు. జరిమానా మొత్తం చెల్లించి వెహికల్ తీసుకువెళ్లాలని సూచించారు.

233చలాన్లు పడేదాకా పోలీసులకు దొరక్కుండా తిరగటం షాకింగ్
అయితే ఆ వాహనాన్ని గత ఏడాది తను కరీంనగర్ కు చెందిన వ్యక్తి నుంచి కొన్నట్టు అస్లాం తెలిపాడు. ప్రస్తుతం ఆ వాహనం ధర 20 వేల కంటే ఉండదని దానిపైన 45.350 రూపాయల జరిమానా ఉందని, చలాన్లు చెల్లించడానికి అంత డబ్బు తన వద్ద లేదని సదరు వాహనదారుడు లబోదిబో మన్నాడు. ఏది ఏమైనా 233 ట్రాఫిక్ చలాన్లు ఉన్న వాహనాన్ని పోలీసులకు దొరకకుండా ఇంతకాలం తప్పించుకొని తిరగడం నిజంగా పోలీసులకు షాక్ అనే చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+