Karimnagar: కరీంనగర్ లో కలకలం రేపుతోన్న చిరుత సంచారం..
చాలా మంది పిల్లలు తల్లిదండ్రులను అడుగుతుంటారు. మమ్మి చిరుత పులులు, సింహాలు, ఏనుగులు ఎక్కడుంటాయని. చిరుత పులులు, సింహాలు, పులులు, ఏనుగులు, పలు రకాల జంతువులు అడవిలో ఉంటాయని సమాధానం చెబుతారు. కానీ ఇప్పుడు అడవి జంతువులు ఊళ్ల బాట పట్టాయి. పల్లెలకే కాకుండా పట్టణాలకు కూడా వస్తున్నాయి. తాజాగా కరీంనగర్ లో చిరుత పులి సంచారం కలకలం రేపింది. దీంతో కరీంనగర్ వాసులు భయంతో వణికిపోతున్నారు.
కరీంనగర్ సిటీలోని సూర్యనగర్ రోడ్ నెంబర్-7 ఏరియాలో చిరుత సంచరించినట్లు తెలుస్తోంది. చిరుత ఓ ఇంటి ముందు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. దీంతో సూర్యనగర్ కాలనీ వాసులు భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
చిరుత అర్ధరాత్రి వీధుల్లో సంచరించడంతో స్థానికులు చిరుతను పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు చిరుతను బంధించి అడవిలో వదిలేయాలని కోరుతున్నారు.

కరీంనగర్ సిటీలోకి చిరుతలే కాదు ఎలుగుబంటి కూడా వచ్చిన సంఘనటలు ఉన్నాయి. గత ఆగస్టులో రేకుర్తి సమీపంలో ఎలుగుబంటి సంచరించింది. ఎలుగుబంటి సంచరించినట్లు సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి. వెంటనే అటవీ శాఖ అధికారులను అప్రమత్తం చేయడం వారు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఎలుగుబంటిని బంధించారు. అడవిలోకి తీసుకెళ్లి వదిలిపెట్టారు.
తాజాగా చిరుత సంచారంతో కరీంనగర్ వాసులు వణికిపోతున్నారు. చిరుతను కూడా బంధించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అటవీ శాఖ అధికారులు ఇంతవరకు స్పందించలేదు.












Click it and Unblock the Notifications