Loksabha Election 2024: ఓటు వేసిన సినీ, రాజకీయ ప్రముఖులు..
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతోన్నాయి. ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలొచ్చి ఓటు వేస్తున్నారు. ఎన్నికల్లో సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తెలంగాణలో ఉదయం 9 గంటల వరకు 9.48 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ ఎన్నికల్లో సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రచయిత, సినీ నటుడు తనికెళ్ల భరణి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
దర్శకుడు రాఘవేంద్ర రావు, హీరో శ్రీకాంత్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సాధారణ ప్రజల వలే క్యూ లైన్ లో నిలబడి ఓటు హక్కు వేశారు. దర్శకుడు గోపిచంద్ ఆంధ్రప్రదేశ్ లోని బడ్లూరివారి పాలెంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొడంగల్ లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కినేని నాగచైతన్య ఓటు వేశారు.

కేటీఆర్ దంపతులు బంజారాహిల్స్ నంది నగర్ కమిటీ హాల్ పోలింగ్ సెంటర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. హిమాన్ష్ తండ్రి కేటీఆర్ తో కలిసి మొదటి సారి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. కేసీఆర్ దంపతులు చింతమడకలో ఓటు వేశారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో హీరో మహేశ్‌బాబు, నమ్రత, మోహన్‌బాబు, మంచు విష్ణు, లక్ష్మి, మనోజ్, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ ఓటు వేశారు. ఎఫ్‌ఎన్‌సీసీ లో జీవిత, రాజశేఖర్, విశ్వక్‌సేన్, దగ్గుబాటి రానా, సురేశ్ బాబు ఓటు వేశారు.
జూబ్లీహిల్స్ క్లబ్ లో నితిన్, జూబ్లీహిల్స్ న్యూ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో రవితేజ , వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్, మణికొండ హైస్కూల్ లో వెంకటేశ్, బ్రహ్మానందం, షేక్ పేట్ ఇంటర్నేషనల్ స్కూల్ లో రాజమౌళి, రమ, ఓటు వేశారు.












Click it and Unblock the Notifications