వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేటీఆర్‌ కుక్కను కరిచారు..అందుకే అలా; కేటీఆర్ కు ఎంపీ అరవింద్ సవాళ్ళ పర్వం

|
Google Oneindia TeluguNews

వరంగల్ లో బీజేపీ పై విరుచుకుపడిన మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై బిజెపి నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడారని నిప్పులు చెరుగుతున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ 111 జీవోకు తూట్లు పొడిచి జన్వాడ ఫాంహౌస్ కట్టారని విమర్శలు చేశారు. జన్వాడ ఫాంహౌస్ పై, రాష్ట్రంలో సాగుతున్న బియ్యం దందా పై సిబిఐ విచారణకు ఎన్వోసీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ మంత్రి కేటీఆర్ కు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సవాల్ విసిరారు.

111 జీవో నిబంధనలకు విరుద్ధంగా జన్వాడ ఫాం హౌస్

111 జీవో నిబంధనలకు విరుద్ధంగా జన్వాడ ఫాం హౌస్

జన్వాడ ఫామ్ హౌస్ 111 జీవో నిబంధనలకు విరుద్ధంగా కట్టింది నిజం కాదా అంటూ ప్రశ్నించిన ఎంపీ అరవింద్ దానిని ఎందుకు కూల్చడం లేదంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో బియ్యం బ్లాక్ దందా సాగుతోందని, ఒక నిజామాబాద్ జిల్లాలోనే సుమారు ఎనిమిది కోట్ల విలువైన ధాన్యం నిల్వల వ్యత్యాసం ఉన్నట్టు తేలిందని ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. ఉత్తరకుమారుడు, తుపాకీ రాముడు, బుడ్డార్ ఖాన్ లను కలిపితే కేటీఆర్ అని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ కు ట్రీట్మెంట్ అవసరమని ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు.

బండి సంజయ్ తంబాకు టెస్ట్ కు రెడీ.. కేటీఆర్ కొకైన్ టెస్ట్ కు రెడీనా

బండి సంజయ్ తంబాకు టెస్ట్ కు రెడీ.. కేటీఆర్ కొకైన్ టెస్ట్ కు రెడీనా

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తంబాకు తింటారు అంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలకు రివర్స్ కౌంటర్ ఇచ్చిన ధర్మపురి అరవింద్ బండి సంజయ్ తంబాకు టెస్ట్ కు రెడీ.. ఆయనను నేను తీసుకొస్తా.. కొకైన్ టెస్ట్ కి కేటీఆర్ రావాలి రెడీనా.. ఏమంటారు వస్తారా? అని ప్రశ్నించారు. కేటీఆర్ అక్రమంగా వేల కోట్ల రూపాయలు సంపాదించాడని మండిపడ్డారు. కేటీఆర్ కుక్కను కరిచాడు అని, అందుకే ఆయన చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నారు అంటూ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.

కేటీఆర్ కు పచెంబ ట్రీట్మెంట్ అవసరం

కేటీఆర్ కు పచెంబ ట్రీట్మెంట్ అవసరం


కేటీఆర్ కు పచెంబ ట్రీట్మెంట్ అవసరమని పేర్కొన్న ధర్మపురి అరవింద్ ఆముదం తీట, కోయిలాకు పూసి పచ్చి చింత బరికెలతో కొడితే పిచ్చి తగ్గుతుందని వ్యాఖ్యానించారు. కేటీఆర్ కు తోలు మందం అయిందని పేర్కొన్నారు. ఎగిరే గుర్రం మోడీ ఎక్కడ, గబ్బు గాడిద కేసీఆర్ ఎక్కడ అంటూ విమర్శించారు. తెలంగాణలో 3 లక్షల 94 వేల కోట్లకు పైగా కేంద్రం ఖర్చు పెట్టిందని ధర్మపురి అరవింద్ తెలిపారు. తాను చెప్పింది తప్పయితే కేటీఆర్ ఏది చెప్తే అది చేస్తాం అంటూ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు.

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చెయ్యటం ఖాయం

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చెయ్యటం ఖాయం


తప్పు కాకపోతే ఆయనను ఎడమ కాలు చెప్పుతో తొక్కుతా సవాల్ కు సిద్ధమా అంటూ ధర్మపురి అరవింద్ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కు హనుమకొండలో ఏం పనో చెప్పాలని ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. మళ్లీ తన పైకి పోటీకి కల్వకుంట్ల కవిత నిలబెడితే ఓడించి ఇంటికి పంపిస్తా అని సవాల్ విసిరారు .అంతేకాదు వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేయడం ఖాయమని ధర్మపురి అరవింద్ వెల్లడించారు.

English summary
MP Arvind said that KTR bit the dog..that is why KTR spoke so strangely. MP Arvind threw a series of challenges to KTR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X