జహీరాబాద్ ఎంపీ వాహనానికి స్వల్ప ప్రమాదం, గేదెను ఢీకొట్టిన కారు
హైదరాబాద్: మెదక్ జిల్లా జహీరాబాద్ టిఆర్ఎస్ పార్లమెంటు సభ్యుడు బీబీ పాటిల్ వాహనం ఆదివారం స్వల్ప ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న వాహనం అడ్డుగా వచ్చిన ఓ గేదెను ఢీకొట్టింది.
దీంతో బిబి పాటిల్ వాహనం దెబ్బతింది. ఈ ఘటనలో ఎంపీ సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ జిల్లా పిట్లం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

అమ్మాయి కిడ్నాప్ అయినట్లు పోలీసులకు సమాచారం
కరీంనగర్ జిల్లాలో అమ్మాయి అపహరణ అయినట్లు కరీంనగర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు సమాచారం అందింది. కారులో అమ్మాయిని అపహరించారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అలుగునూరు చెక్‌పోస్టు, రేణికుంట టోల్‌ప్లాజా, బెజ్జంకిలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.
నకిలీ నెయ్యి తయారీ కేంద్రాలపై దాడులు
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కుంచపర్తిలో నకిలీ నెయ్యి తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. ప్రముఖ సంస్థ పేరుతో నెయ్యి తయారు చేస్తున్నారన్న సమాచారంతో దాడులు చేశారు. దాడుల్లో భాగంగా 40 డబ్బాల నకిలీ నెయ్యి, 2 యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications