కరోనా వస్తే కాటికి తప్ప ఇంటికి వెళ్లే పరిస్థితులు లేవు.!గాంధీలో కరోనా రోగుల ఆకలి తీర్చేందుకు రేవంత్ శ్రీకారం.!
హైదరాబాద్ : కరోనా క్లిష్ట సమయంలో కరోనా రోగుల కోసం మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో గాంధీ ఆసుపత్రిలో ప్రతిరోజు వెయ్యి మందికి భోజన సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపారు. అందుకోసం శుక్రవారం నుండే ఆయన కార్యాచరణ రూపొందించుకొని గాంధీ ఆసుపత్రిలో రోగులకు భోజనాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంతే కాకుండా కరోనా రోగులకు సరియైన వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. కరోనా వస్తే కాటికి వెళ్లే పరిస్థితులు తప్ప ఇంటికి వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. కరోనా బాధితులకు వైద్యం అందించేందుకు డాక్టర్లు ఆక్సిజన్, ఇంజెక్షన్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితిలు తలెత్తాయని, ఆస్పత్రుల్లో నిరంతరాయంగా ఆక్సిజన్, ఇంజెక్షన్స్, మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్నిరేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు.

గాంధీ ఆసుత్రిలో అన్నదానం.. ప్రతిరోజూ వెయ్యిమందికి భోజనం పెట్టేందుకు శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి..
కరోనా క్లిష్ఠ సమయంలో మెరుగైన వైద్యం అందిస్తూ ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వైద్య వ్యవస్థ దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆసుపత్రుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యిందని, సరైన వైద్య సౌకర్యాలు, మందులు, ఇంజక్షన్లు, వైద్య కిట్లు అందుబాటులో లేక డాక్టర్లు నిస్సహాయత వ్యక్తం చేసే పరిస్దితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసారు. క్షేత్ర స్థాయిలో కరోనా చికిత్సకు సంబందించిన వివరాలు తెలియక, సకాలంలో బెడ్లు దొరకక కరోనా పేషెంట్ల నిర్దాక్షిణ్యంగా చనిపోతున్నారని రేవంత్ తెలిపారు.

ఆసుపత్రుల్లో కరోనా రోగుల అవస్ధలు.. సరైన కిట్లు లేక ఇబ్బంది పడుతున్న డాక్టర్ల వ్యవస్థ అంటున్న ఎంపీ
కరోనా వైద్య కిట్లు అందుబాటులో లేక పోవడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని రేవంత్ రెడ్ది ఘాటుగా విమర్శించారు. మొదటి వేవ్ కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు కరోనా నియంత్రణ పేరిట కిట్లు, ముందుల కొనుగోళ్లలో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. అందులో భాగంగా వైద్యపరికరాలు, కిట్ల అందుబాటులో జాప్యం జరిగి దాని ఫలితానికి ఇప్పుడు అమాయకులు బలి అవుతన్నారని తెలిపారు. కరోనా అంశంలో ప్రభుత్వం అడుగడుగునా చేసిన తప్పిదాల వల్లే ఇన్ని మరణాలు సంభవిస్తున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కరోనా పట్ల కేంద్రం చేతులెత్తేసింది.. ఘాటు విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి..
కరోనా రెండవ దశను కేంద్ర ప్రభుత్వం సమర్ధవంతంగా అధిగదమిస్తుందనుకుంటే అందుకు విరుద్దంగా వ్యవహరిస్తోందని, కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిదని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. కరోనా చికిత్స కోసం వినియోగించే వస్తువులపై 12 శాతం జీఎస్టీ కేంద్రం వసూలు చేయడం దారుణమైన అంశంగా పేర్కొన్నారు. అన్యాయంగా వసూలు చేస్తున్న జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లాక్‌డౌన్ కారణంగా ప్రజలు ఉపాది కోల్పోయి ఆర్దికంగా చితికిపోయారని, ఇలాంటి సందర్బంలో వైద్య కిట్లపై జీఎస్టీని అమలు చేస్తే ప్రజలకు మరింత భారం అవుతుందని రేవంత్ రెడ్డి కేంద్రానికి సూచించారు.

లాక్‌డౌన్ ముడిసే వరకూ నిరంతర అన్నదానం.. గాంధీలో కరోనా రోగుల ఆకలి తీర్చిన రేవంత్ రెడ్డి..
ఇదిలా ఉండగా సికిందరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో కోవిడ్ ఆసుపత్రిగా మార్చి కరోనా రోగులకు వైద్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా తో వ్యాధితో ఆసుపత్రిలో చేరిన రోగి బంధువులు అనేక సమస్యల బారినపడుతన్నట్టు కొంత మంది బాదితులు రేవంత్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. అలాంటి వారికి ఉండడానికి, విశ్రింతి తీసుకోవడానికి కొన్ని సౌకర్యాలు కల్పించాలని రేవంత్ రెడ్డి సూచిస్తున్నారు. అందులో బాగంగా గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఆయన కరోనా రోగులకు, బంధువులకు భోజన సౌకర్యాన్ని ఏర్పటు చేసారు. ఆసుపత్రి సిబ్బందే భోజన సౌకర్యం అమలుచేస్తే మరింత రోగులకు మరింత వెసులు బాటు ఉండి ఉండేదని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
Recommended Video
-
ఆ ఉద్యోగులకు బిగ్ షాక్.. జీతంలో ప్రతి నెలా రూ. 10వేలు కట్: సీఎం రేవంత్ సంచలన నిర్ణయం -
మూసీ తీరాన ఆధ్యాత్మిక వైభవం.. 700 కోట్లతో భారీ ఆలయాల ప్రాజెక్ట్.. సీఎం శంకుస్థాపన -
మూసీపై బిగ్ స్టెప్- చెప్పిందే చేసిన రేవంత్ -
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
కేసీఆర్ దళిత వ్యతిరేకి: సీఎం రేవంత్ రెడ్డి -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..!












Click it and Unblock the Notifications