టీమిండియా కెప్టెన్ ధోనీని కలిసేందుకు సైకిల్ యాత్ర: రాంచీకి బయల్దేరిన అభిమాని
హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు కెప్టన్ మహేంద్ర సింగ్ ధోనీ వీరాభిమాని పీరంచెరువుకు చెందిన కిరణ్ శుక్రవారం ధోనీని కలిసేందుకు సైకిల్‌పై రాంచీకి పయనమయ్యారు. సైకిల్ యాత్రను గ్రామ నాయకుడు నాగరాజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. ధోనీ సాధించిన పరుగులు, శతకాలు, రికార్డులపై పుస్తకాన్ని రాశానని తెలిపారు. 25 రోజుల పాటు సైకిల్‌పై రాంచీకి వెళ్లి ధోనిచే పుస్తకాన్ని ఆవిష్కరిస్తామన్నారు.

కాగా, ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోనీ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు ట్వంటీ20 మ్యాచుల్లో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే.
మరో మ్యాచ్ వర్షం కురియడంతో రద్దు అయింది. దీంతో ట్వంటీ20 సిరీస్ దక్షిణాఫ్రికా కైవసమైంది. త్వరలో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్ కోసం టీమిండియా కసరత్తు చేస్తోంది.












Click it and Unblock the Notifications