ఢిల్లీ అమ్మాయిలతో మొయినాబాద్ లో ముజ్రా పార్టీలో మునిగి ఉండగా...
హైదరాబాద్ అశ్లీల నృత్యాలకు అడ్డాగా మారుతుంది. హైదరాబాద్, మొయినాబాద్ తదితర ప్రాంతాలలోని ఫామ్ హౌస్ లలో రేవ్ పార్టీలు, ముజ్రా పార్టీల కల్చర్ రోజురోజుకు పెరుగుతోంది. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా ఈ అశ్లీల నృత్యాల కల్చర్ మాత్రం పోవడం లేదు. తాజాగా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీ జరిగింది. ఈ పార్టీని పక్కా సమాచారంతో పోలీసులు భగ్నం చేశారు.
మొయినాబాద్ లో ముజ్రా పార్టీ
అసలేం జరిగిందంటే మొయినాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో 12 మంది అబ్బాయిలతో, నలుగురు అమ్మాయిలు ముజ్రా పార్టీ చేసుకుంటున్నారు. ముజ్రా పార్టీ కోసం ఢిల్లీ నుంచి నలుగురు అమ్మాయిలను యువకులు హైదరాబాద్ కు తీసుకువచ్చారు. ఇక ఈ అమ్మాయిలతో అర్ధనగ్న డాన్సులు చేస్తూ పార్టీ చేసుకుంటున్న క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ నిర్వహించారు.

రైడ్ చేసిన ఎస్వోటీ పోలీసులు
పోలీసుల రైడ్ లో మొత్తం అశ్లీల నృత్యాలు చేస్తున్న 12 మంది అబ్బాయిలను 6 మంది అమ్మాయిలను ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రైడ్ లో ఎస్ఓటి పోలీసులు పాల్గొన్నారు. వీరి వద్ద నుండి మద్యం బాటిల్స్, మొబైల్ ఫోన్స్, తోపాటు నగదును స్వాధీనం చేసుకున్నారు .ఎస్వోటీ పోలీసులు వీరిని మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. ముజ్రా డ్యాన్స్ మొఘలుల కాలం నాటి తవాయిఫ్ లు చేసే నృత్యం. దానిని ఇలా అశ్లీలంగా మార్చేశారు.
నగర శివారు ఫాం హౌస్ లలో గలీజ్ దందా
వీకెండ్స్ లో హైదరాబాద్ శివారు ప్రాంతాలలోని ఫామ్ హౌస్ లలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం ప్రస్తుతం అనేక కేసుల ద్వారా వెలుగులోకి వస్తోంది. ఫామ్ హౌస్ ల పేరుతో నిర్వహకులు ఇటువంటి గలీజ్ దందాలు ప్రోత్సహిస్తున్నారు. కొంతమంది ఫామ్ హౌస్ నిర్వాహకులు అయితే ఏకంగా వారే అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. దీంతో ఫ్యామిలీలు ఫామ్ హౌస్ లకు వెళ్ళాలంటే భయపడుతున్నారు.
జోరుగా వ్యభిచార దందా
నిబంధనలకు విరుద్ధంగా యువతకు మద్యం, మత్తు పదార్థాలను అందిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అందమైన అమ్మాయిలను రప్పించి నగ్న, అర్ధ నృత్య ప్రదర్శనలు, చేయిస్తున్నారు. వ్యభిచార దందా జోరుగా సాగిస్తున్నారు. ఇక ఈ అశ్లీల నృత్యాల కల్చర్ కు చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.












Click it and Unblock the Notifications