గడ్డపోతారం మున్సిపాలిటీపై గులాబీ జెండా.. కాంగ్రెస్ కు బిగ్ షాక్!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. అన్ని రాజకీయ పార్టీలలో ఉత్కంఠత నెలకొంది. ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థుల రాజకీయ భవితవ్యం నేడు తేలనుంది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పలు చోట్ల విజయం సాధిస్తూ జోరు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ కు షాక్ ఇస్తున్నారు.
గడ్డపోతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఖాతాలో
గడ్డపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. వార్డు ఫలితాలు వరుసగా వెలువడుతున్న క్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకపక్ష విజయాలతో స్పష్టమైన ఆధిక్యాన్ని నమోదు చేశారు. మొత్తం లెక్కింపులో 14 వార్డుల్లో బీఆర్ఎస్ విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు వార్డులకే పరిమితమైంది. ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచినా, మున్సిపాలిటీ అధికారంపై ప్రభావం చూపే స్థాయిలో వారి సంఖ్య లేకపోవడం గమనార్హం.

కాంగ్రెస్ కు షాక్
స్పష్టమైన మెజార్టీతో బీఆర్ఎస్ మున్సిపాలిటీపై పూర్తి పట్టు సాధించింది. వార్డు స్థాయి ఫలితాల్లోనే కాకుండా, మొత్తం పాలనాధికారాన్ని కైవసం చేసుకోవడం ఆ పార్టీకి కీలక విజయంగా భావిస్తున్నారు. కాంగ్రెస్ కొన్ని ప్రాంతాల్లో గెలుపొందినా, మున్సిపాలిటీ అధికారం సాధించే స్థాయిలో ఫలితాలు నమోదు కాలేదు. ఈ ఫలితంతో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో తొలి మున్సిపాలిటీని గెలుచుకున్న పార్టీగా బీఆర్ఎస్ నిలిచింది.
ఈ వార్డులలో బీఆర్ఎస్ విజయం
మిగిలిన మున్సిపాలిటీల ఫలితాలపై కూడా ఈ విజయ ప్రభావం ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ కుమార్ 100 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అదే మున్సిపాలిటీలోని 11వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కొండ్రు శ్రీలత గెలిచారు. మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీలోని 19వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గురుక కుమార్ విజయం సాధించారు.
చాలా మున్సిపాలిటీలు బీఆర్ఎస్ ఖాతాలో
మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలోని 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మద్దెల మాధవి 39 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇంకా చాలా మున్సిపాలిటీలు తమ ఖాతాలో పడతాయి అన్న ధీమాలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications