municipal elections results..ఆ మున్సిపాలిటీలలో హంగ్..అక్కడ వీరే కింగ్ మేకర్లు!

తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అత్యంత ఉత్కంఠ భరితంగా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేక మున్సిపాలిటీల కౌంటింగ్ పూర్తికాగా, మరికొన్ని మున్సిపాలిటీలలో నువ్వా నేనా అన్నట్టు హోరాహోరీగా పోరు సాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది.

ఆ మున్సిపాలిటీలలో హంగ్

పలుచోట్ల బీఆర్ఎస్ గట్టి పోటీనిస్తుండగా, బీజేపీ మూడో స్థానంలో కొనసాగుతోంది. చాలా మున్సిపాలిటీలలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రధాన సమరం కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో కొన్ని మున్సిపాలిటీలలో హంగ్ ఏర్పడటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది మున్సిపాలిటీల పరిధిలో రాజకీయ వర్గాలలోను, ప్రజలలోను ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఇప్పటివరకు జహీరాబాద్, కేసముద్రం, కోహిర్, దేవరకద్ర, అలంపూర్, ఇస్నాపూర్, అమరచింత, జనగామ, ఆసిఫాబాద్‌తో సహా తొమ్మిది మున్సిపాలిటీలలో హంగ్ ఏర్పడింది.

municipal elections results congressvs brs hung in 9 municipalities independents are kingmakers

అక్కడ వారిదే హవా

ఈ మున్సిపాలిటీలలో గెలిచిన స్వతంత్రులు కీలకం కానున్నారు. అయితే ఎక్స్‌ అఫిషియో ఓట్లతో కాంగ్రెస్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న చర్చ జరుగుతుంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఇక్కడ మొత్తం 16 వార్డులు ఉండగా కాంగ్రెస్ ఎనిమిది, బి ఆర్ ఎస్ ఎనిమిది స్థానాలను గెలుచుకున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు సమానంగా వార్డులు గెలుచుకోవడంతో ఇక్కడ హంగ్ ఏర్పడింది.

కింగ్ మేకర్లుగా ఇండిపెండెంట్ లు

ఇక్కడ కేసముద్రం మున్సిపాలిటీ ఏ పార్టీ ఖాతాలో పడుతుందో అన్న ఆసక్తి అందరిలోనూ వ్యక్తమౌతుంది. ఇదిలా ఉంటే జనగామ మున్సిపాలిటీలో కూడా చైర్మన్ పీఠం పైన ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఇద్దరు సమానంగా 13, 13 స్థానాలను గెలుచుకోగా హంగ్ ఏర్పడింది. ఇక్కడ నలుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. ఇక వీరే జనగామలో కింగ్ మేకర్లు కాబోతున్నారు.

హంగ్ ఏర్పడిన చోట బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్

అయితే హంగ్ ఏర్పడిన చోట కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీ ల వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఎలా ఉంటాయి అన్న చర్చ స్థానికంగా జరుగుతుంది. మెజార్టీ స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలని శత విధాలా ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ hang ఏర్పడిన మున్సిపాలిటీలను తమ ఖాతాలో వేసుకుంటుందా లేదా అన్నది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+