మునుగోడు ఉపఎన్నికపై పార్టీల దొంగాట; ఫేక్ న్యూస్ తో ప్రజల్లో గందరగోళం!!

మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలకు ముందు ప్రత్యర్థుల శ్రేణుల్లో గందరగోళం సృష్టించేందుకు ఫేక్ న్యూస్ యుద్ధం ఇప్పటికే ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. ప్రధాన పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తో పాటుగా, ఒక పార్టీకి సంబంధించి ఇంకొక పార్టీ ఫేక్ వార్తలు ప్రచారం చేస్తూ ఉండటం ప్రజల్లో గందరగోళం సృష్టిస్తుంది. అసలు మునుగోడు ఉప ఎన్నికల్లో ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠకు కారణంగా మారింది.

 టీఆర్ఎస్ లో ముసలం ... దుష్ప్రచారం అంటున్న గులాబీ నేతలు

టీఆర్ఎస్ లో ముసలం ... దుష్ప్రచారం అంటున్న గులాబీ నేతలు

మునుగోడు ఉపఎన్నిక అన్ని పార్టీలకు కీలకం కావడంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే, ఇప్పటి నుండే రంగంలోకి దిగి మునుగోడులో పాగా వేసి రాజకీయాలు చేస్తున్నాయి. టిఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు జరుగుతున్నాయని, పార్టీలో చాలామంది నేతలు బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారని పెద్ద ఎత్తున వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక దీనిపై టిఆర్ఎస్ మంత్రి అలాంటిదేమీ లేదని అంతా కలిసి పని చేస్తున్నామని, అభ్యర్థిగా కేసీఆర్ ఎవరిని ఖరారు చేస్తే వాళ్ళ కోసం పని చేస్తామని చెప్పుకొస్తున్నారు. కావాలని బిజెపి నేతలు ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

మునుగోడా? ముందస్తా... ఫేక్ న్యూస్ అన్న గులాబీ నేతలు

మునుగోడా? ముందస్తా... ఫేక్ న్యూస్ అన్న గులాబీ నేతలు


మునుగోడు ఉప ఎన్నిక కంటే ముందుగా ముందస్తుకు వెళ్దామా అని టీఆర్ఎస్ బాస్ ఆలోచిస్తున్నారు అని వచ్చిన వార్తలను గులాబీ నేతలు ఫేక్ వార్తలని మండిపడుతున్నారు. మునుగోడు ఉపఎన్నిక విషయంలో తమకు ఎలాంటి భయం లేదని, తమతో ఏ పార్టీ పోటీ చెయ్యలేవని చెప్తున్నారు. మునుగోడులో టీఆర్ఎస్ విజయం ఖరారైందని చెప్తున్నారు. ఇది కావాలని తాము భయంలో ఉన్నట్టు బీజేపీ సృష్టించిన ఫేక్ న్యూస్ అని చెప్తున్నారు.

అమిత్ షా సభ వాయిదా, సాలు దొర సెలవు దొరకు ఈసీ బ్రేక్ .. ఫేక్ వార్తలు అన్న బీజేపీ

అమిత్ షా సభ వాయిదా, సాలు దొర సెలవు దొరకు ఈసీ బ్రేక్ .. ఫేక్ వార్తలు అన్న బీజేపీ


ఇదే సమయంలో బిజెపి నిర్వహించనున్న సభ కు అమిత్ షా రావడంలేదని, అమిత్ షా సభకు కాన్సిల్ అయిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాదు మంత్రి కేసీఆర్ ను టార్గెట్ గా చేసుకొని బీజేపీ నిర్వహిస్తున్న సాలు దొర సెలవు దొర ప్రచారాన్ని నిలిపివేయాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశించి, బిజెపి కి షాక్ ఇచ్చిందని ప్రచారం జరగడంతో, ఇక ఈ ప్రచారాలను ఫేక్ వార్తలని బిజెపి నేతలు ఖండిస్తున్నారు.

ప్రభుత్వ వ్యతిరేఖతపై ఆందోళనతో టీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందన్న బీజేపీ

ప్రభుత్వ వ్యతిరేఖతపై ఆందోళనతో టీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందన్న బీజేపీ


సాలు దొర సెలవు దొర క్యాంపైన్ ను నిలిపివేయాలని ఈసీ ఆదేశాలు ఇచ్చిందని వచ్చిన వార్తలలో నిజం లేదని బీజేపీ నేతలు ఖండిస్తున్నారు . సాలు దొర సెలవు దొర ప్రచారం ప్రభావం మరియు ప్రజల్లో పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలో ఆందోళన చెందుతున్న టిఆర్ఎస్ పార్టీ ఈ తరహా ప్రచారాన్ని చేపట్టిందని పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు. ఇక ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చెయ్యాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ప్రజల్లో తప్పుడు వార్తల విషయంలో పార్టీ నేతలు అవగాహన కల్గించాలని సూచించారు.

అమిత్ షా సభ యధావిధిగానే... ఫేక్ ప్రచారం నమ్మొద్దన్న బీజేపీ

అమిత్ షా సభ యధావిధిగానే... ఫేక్ ప్రచారం నమ్మొద్దన్న బీజేపీ


అంతేకాదు ఆగస్ట్ 21న మునుగోడులో కేంద్ర మంత్రి అమిత్ షా బహిరంగ సభ వాయిదా పడిందన్న ఫేక్ న్యూస్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొట్టిపారేశారు. సమావేశం వాయిదా పడిందన్న వార్తల్లో నిజం లేదని సంజయ్ అన్నారు. షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని చెప్పారు. వాయిదా పడిందన్న వదంతులను నమ్మవద్దు అని సంజయ్ పేర్కొన్నారు. ఇదంతా కెసిఆర్ కనుసన్నల్లో టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న, ఫేక్ ప్రచారమని బిజెపి నేతలు తేల్చి చెబుతున్నారు.

ఫేక్ వార్తలతో ప్రజల్లో కన్ఫ్యూజన్

ఫేక్ వార్తలతో ప్రజల్లో కన్ఫ్యూజన్


ఏది ఏమైనా మునుగోడు నియోజకవర్గంలో రోజుకో రకంగా జరుగుతున్న ప్రచారంతో ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం చేసుకోలేని గందరగోళ పరిస్థితి ప్రజలలో చోటుచేసుకుంది. రాజకీయ పార్టీలు చేస్తున్న ఫేక్ ప్రచారాలని నమ్మి కన్ఫ్యూజ్ అవుతున్న ప్రజలు రాజకీయ నేతల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+