రూ. 1,88,888 కు గణేష్ లడ్డూ దక్కించుకున్న ముస్లిం మహిళ
తెలంగాణలో మతసామరస్యం వెల్లివిరిసింది. ఓ ముస్లిం మహిళ గణేష్ లడ్డూను దక్కించుకుంది. అది కూడా భారీ ధరకు దక్కించుకుంది. దీంతో స్థానికులు ఆమెను అభినందిస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జనం సందర్భంగా లడ్డూను వేలంపాట వేశారు. ఈ వేలంపాటలో అదే కాలనీకి చెందిన ముస్లిం మహిళ అమ్రీన్ పాల్గొంది. ఆమె రూ. రూ.1,88,888 కు లడ్డూను దక్కించుకుంది. దీంతో ఆమెకు స్థానికులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
వెల్లివిరిసిన మతసామరస్యం
— Telugu Scribe (@TeluguScribe) September 7, 2025
నిర్మల్ పట్టణంలోని ఈద్గాం ఆదర్శ్ నగర్ గణపతి లడ్డూ వేలంలో రూ.1,88,888కి లడ్డూను దక్కించుకున్న ముస్లిం మహిళ అమ్రీన్ pic.twitter.com/ot6EG04BIL
తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో మతసామరస్యం వెల్లివిరిసింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ నగర్ కాలనీలో అద్భుతం జరిగింది. ఓ ముస్లిం మహిళ గణేష్ లడ్డూను దక్కించుకుంది. దీంతో ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. నిర్మల్ పట్టణంలోని ఈద్గాం ఆదర్శ్ నగర్ గణపతి లడ్డూ వేలంలో రూ.1,88,888 కు లడ్డూను ముస్లిం మహిళ అమ్రీన్ దక్కించుకుంది. దీంతో ఆమెకు స్థానికులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆమె ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది.
నిర్మల్ జిల్లాలో మరో ఘటన జరిగింది. కుంటాల మండలంలోని అంబకంటిలో గణేష్ నిమజ్జనం వేల నిర్వహించిన వేలం పాటలో స్థానికులుగా ఉన్న ఓ ముస్లిం కుటుంబం వేలంపాటలో పాల్గొంది. ఈ క్రమంలో ఏడవ తరగతి విద్యార్థి రెహమాన్ రూ. 1111 వేలం పాట పాడి లడ్డూను దక్కించుకున్నాడు.

అటు మహారాష్ట్రలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. అక్కడ కూడా మతసామరస్యం వెల్లివిరిసింది. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా గోట్ఖిండీ గ్రామంలోని ఓ మసీదులో ముస్లింలు వినాయకుడిని ఏర్పాటు చేసి 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సంప్రదాయం 1980లోనే అక్కడ ప్రారంభమైంది. ఏటా గణేష్ నవరాత్రులు నిర్వహించి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. హిందూముస్లింలు ఉమ్మడిగా ఈ వేడుకల్లో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications