మటన్ కారం పొడి.. ఇలా ట్రై చెయ్యండి.. అస్సలే వదిలిపెట్టరు!

మనం అన్నంలో కలుపుకుని తినటానికి రకరకాల కారం పొడులు చేస్తాం. పుట్నాల పొడి, కరివేపాకు పొడి, మునగాకు పొడి, మసాలా కారం పొడి, పల్లీకారం, నువ్వుల కారం ఇవి మాత్రమే కాక చికెన్ కారం పొడి, రొయ్యల కారంపొడి కూడా తయారు చేసి తింటాం.

మటన్ కారం పొడి

రోటీ, అన్నంతో కలిపి తినడానికి కారం పొడులు ఎంతో రుచిగా ఉంటాయి. సాధారణ కారం పొడులు కాకుండా ఒక్కసారి మటన్‌తో కారం పొడి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. మటన్ తో చేసిన కారం పొడి తినటానికి కూడా రుచి బాగుంటుంది. ఈ కారం పొడిని చాలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

mutton karam podi How to Make Delicious Mutton Karam Podi at Home know the simple process for tasty mutton karampodi

కావలసిన పదార్థాలు:

బోన్‌లెస్ మటన్ - 250 గ్రాములు,
ఎండు మిరపకాయలు - 20,
ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు,
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్,
మిరియాలు - అర స్పూన్,
వెల్లుల్లి రెబ్బలు - 15,
కరివేపాకు - 2 రెమ్మలు,
పసుపు - పావు స్పూన్,
ఉప్పు - తగినంత,
నూనె - వేయించడానికి సరిపడా.

తయారీ విధానం:

ముందుగా మటన్ ముక్కలకు కొద్ది నీళ్లు, పసుపు, ఉప్పు కలిపి కుక్కర్‌లో 5 విజిళ్లు వచ్చేలా ఉడికించాలి. ఆవిరి పోయిన తర్వాత ముక్కల్లో నీరు ఉంటే సన్నని సెగ మీద పూర్తిగా ఇగిరిపోయేలా ఉంచాలి. ఆ తర్వాత ఆ ముక్కలను నూనెలో బాగా వేయించాలి. ముదురు రంగులోకి మారేలా వేయించాలి. ఇలా వేయించినప్పుడే పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

ఇలా చేస్తే మటన్ కారం పొడి బాగుంటుంది

ఇంకో ప్యాన్‌లో కొద్ది నూనె వేసి ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండు మిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలను దోరగా వేయించి చల్లార్చాలి. ముందుగా ధనియాలు, జీలకర్ర, మిరియాలను గ్రైండ్ చేసి, తర్వాత మిగతా వాటిని కలిపి పొడి చేయాలి. చివరగా ఉప్పు, వేయించిన మటన్ ముక్కలను వేసి కొంచెం బరుకగా ఉండేలా గ్రైండ్ చేయాలి.

కాకరకాయ నిల్వ పచ్చడి.. ఇలా చేస్తే కాకరకాయలు తిననివాళ్ళు కూడా రోజూ కావాలంటారు!
కాకరకాయ నిల్వ పచ్చడి.. ఇలా చేస్తే కాకరకాయలు తిననివాళ్ళు కూడా రోజూ కావాలంటారు!

అన్నం అయినా టిఫిన్స్ అయినా సూపర్ కారం పొడి

తయారైన మటన్ కారం పొడిని తేమ లేని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే 15 రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంటుంది. ఈ కారం పొడి అన్నం అయినా, టిఫిన్స్ లో అయినా సూపర్ గా ఉంటుంది. ఇంకెందుకాలస్యం నాన్ వెజ్ లవర్స్ ఈ కారం పొడిని తయారు చేసుకుని ఒక పట్టు పట్టేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+