మరో వారంలో పెళ్లి: మత్తు సెలైన్ ఎక్కించుకుని యువవైద్యుడి ఆత్మహత్య
మరో వారంలో పెళ్లనగా ఓ యువ వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఇరుకుటుంబాల్లో విషాధ ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
హైదరాబాద్/కరీంనగర్: మరో వారంలో పెళ్లనగా ఓ యువ వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఇరుకుటుంబాల్లో విషాధ ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ ఎస్సై నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ సప్తగిరికాలనీకి చెందిన గ్రానైట్ వ్యాపారి తిరుపతిగౌడ్ కుమారుడు శివానంద్‌గౌడ్(30) నగరంలోని రెండు ప్రైవేటు ఆసుపత్రులలో రేడియాలజిస్ట్‌గా పనిచేస్తున్నాడు.
రాజేంద్రనగర్ హైదర్‌గూడలోని జనప్రియా అపార్ట్‌మెంట్‌లోని నాలుగో బ్లాక్‌లోని ఓ ఫ్లాట్‌లో ఉంటున్నాడు. కాగా, కరీంనగర్ నుంచి శనివారం రాత్రి హైదర్‌గూడకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఏం జరిగిందో ఏమో గానీ.. ఆదివారం మధ్యాహ్నం సమయంలో సెలైన్‌బాటిల్‌లో మిజోలం అనే మత్తు పదార్థం శరీరంలో సెలైన్‌ద్వారా ఎక్కించుకొని ఆత్యహత్యకు పాల్పడ్డాడు శివానంద్.

మృతదేహం పక్కన ఐదు మిజోలం బాటిల్స్ పడి ఉన్నట్లు ఎస్సై తెలిపారు. మూర్ఛవ్యాధి నివారణకు వాడే ఈ మందును ఎక్కువ మోతాదులో తీసుకుంటే వ్యక్తి మృతి చెందుతాడని ఓ వైద్యుడు తెలిపారు. కాగా, శివానంద్‌గౌడ్‌కు మార్చి 8వ తేదీన పెళ్లి కుదిరినట్లు తెలిసింది.
పెళ్లి వారం రోజులు ఉన్న నేపధ్యంలో అతను ఆత్మహత్యకు పాల్పడటం పట్ల పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్ నుంచి అతని కుటుంబ సభ్యులు వస్తే పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. కాగా, శివానంద్ కరీంనగర్ శివారులోని చల్మెడ వైద్య కళాశాలలో ఎండీ(రేడియాలజీ) పూర్తి చేశారు. శివానంద్ మృతి పట్ల అతని స్నేహితులైన వైద్యులు తమ సంతాపం ప్రకటించారు.












Click it and Unblock the Notifications