సమంతతో విడాకులపై నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు; సమంత ఇంట్రెస్టింగ్ రిప్లై
తన మాజీ భార్య, నటి సమంత గురించి నాగచైతన్య తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటి సమంత మంచి మనసున్న వ్యక్తి అని నాగచైతన్య పేర్కొన్నారు. ఆమె జీవితంలో ఎప్పుడూ సంతోషంగానే ఉండాలని కోరుకుంటున్నానని నాగ చైతన్య పేర్కొన్నారు. ఇటీవల నాగచైతన్య తన తదుపరి చిత్రమైన కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి సమంత తో ఆయన విడాకులు తీసుకున్న అంశంపై వ్యాఖ్యలు చేశారు.
ఇద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య తొలిసారిగా సమంతతో విడాకుల గురించి మాట్లాడారు. తాము ఇద్దరం చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నామని నాగచైతన్య పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వదంతుల వల్లే మా మధ్య ఇబ్బందికరంగా పరిస్థితులు మారాయని నాగచైతన్య వెల్లడించారు. ఒకరిపై ఒకరికి గౌరవం లేనట్లుగా జనాలలో ప్రచారం జరిగిందని అది తనను ఎంతగానో బాధించిందని తెలిపారు.

నిజానికి సమంత చాలా మంచి అమ్మాయని, ఆమె అన్ని ఆనందాలకు అర్హురాలు అని పేర్కొన్నారు.ఇక తాము విడిపోయి రెండు ఏళ్ళు అవుతుందని, చట్ట ప్రకారం విడాకులు తీసుకుని ఏడాదికాలం అవుతుందని నాగచైతన్య పేర్కొన్నారు. ప్రస్తుతం తాము ఎవరి జీవితాల్లో వారు ముందుకు పోతున్నామని వెల్లడించారు.జీవితంలోని ప్రతి దశను తాను గౌరవిస్తానని నాగచైతన్య పేర్కొన్నారు.
అంతేకాదు తన గతంతో సంబంధం లేని మూడోవ్యక్తిని కూడా ఇందులోకి లాగి వార్తలు రాశారని, దానివల్ల ఆ మూడో వ్యక్తిని కూడా అగౌరవ పరిచినట్లుగా పరిస్థితి మారిందని అన్నారు.ఇది అన్నిటి కంటే చెత్త విషయం అన్నారు. ఈ క్రమంలో సమంత కూడా నాగచైతన్య వ్యాఖ్యల తర్వాత ఆయనను ఉద్దేశించే సమంత ఒక పోస్ట్ చేశారు.
మనమంతా ఒక్కటే కేవలం అహంకారం, నమ్మకాలు, భయాలు మనల్ని దూరం చేస్తాయి.అంటూ ఒక కొటేషన్ ను సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. నాగచైతన్య సమంత పై వ్యాఖ్యలు చేసిన అనంతరం సమంత ఇన్ స్టాగ్రామ్ లో ఈ పోస్ట్ చేయడం వీరిద్దరూ ఈగోలకు పోయి విడిపోయారా అని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఇద్దరి మాటల్లో ఒకరంటే ఒకరికి ద్వేషం లేదని కూడా చర్చిస్తున్నారు.












Click it and Unblock the Notifications