నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.. బాలకృష్ణ హాట్ కామెంట్స్ వైరల్!
అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చివేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది. దీనిపైన ప్రస్తుతం పెద్ద వివాదమే నడుస్తుంది. అయితే దీనిపైన స్టే వుందని నాగార్జున చెబుతుంటే అలాంటిదేమీ లేదని కోర్టు ఎటువంటి స్టే ఇవ్వలేదని అందుకే కూల్చేశామని చెబుతున్నారు. హైడ్రా అధికారులు అయితే అది తాము కొనుగోలు చేసిన పక్కా పట్టాభూమి అని దీనిపైన కోర్టులోనే తేల్చుకుంటామని అక్కినేని నాగార్జున కూడా తేల్చిచెప్పారు.
నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.. బాలకృష్ణ హాట్ కామెంట్స్
నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పైన ప్రస్తుతం వివాదం కొనసాగుతూనే ఉంది. ఇదే సమయంలో గతంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వేళ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భూములు పంచుకోవడం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులందరూ కలిసారని, అప్పట్లో సీఎం కేసీఆర్ తో చర్చలు జరిపిన సమయంలో బాలకృష్ణ వ్యాఖ్యలు చేశారు.

లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్ లో కొన్ని సమస్యల పరిష్కారం కోసం కార్మికుల సంక్షేమం కోసం అప్పటి తెలంగాణ ప్రభుత్వంతో చిరంజీవి, నాగార్జునతో సహా సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు చర్చలు జరిపారు. అప్పుడు బాలకృష్ణను ఎవరు ఆహ్వానించలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలకృష్ణ తనను మీటింగ్ కు ఎవరు ఆహ్వానించలేదని వాళ్లు భూములు పంచుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
అప్పుడు బాలయ్య చెప్పిందే నిజమైందని చర్చ
వాళ్లంతా కలిసింది చర్చలు జరుపుతుంది వాళ్ళ వ్యాపారాల కోసమేనంటూ ఆయన ఆరోపించారు. ఇక తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యలను ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో ముడిపెట్టి కొందరు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అప్పుడు బాలకృష్ణ చెప్పిందే నిజమైందని వ్యాఖ్యలు చేస్తున్నారు. బాలకృష్ణ నాగార్జున మధ్య అభిప్రాయ భేదాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.
తెలంగాణలో రచ్చగా మారిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత
బాలయ్య వీడియోని చూసిన చాలామంది ఇది వాస్తవమేనని చెబుతున్నారు. బాలకృష్ణ అప్పుడే సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు చేసినటువంటి రియల్ దందాల పైన మాట్లాడారని, ఇప్పుడు అవన్నీ హైడ్రా చొరవతో బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. మొత్తానికి నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారం తెలంగాణా లో రచ్చ రేపుతుంది.
-
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!!












Click it and Unblock the Notifications