ఎమ్మెల్యే కొనుగోళ్లా?: పూజ కోసమే వచ్చామంటూ నందకుమార్ వెల్లడి
హైదరాబాద్: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తులు కొనుగోలు చేస్తున్నారంటూ ప్రచారం జరగడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం రేపింది. అయితే. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యేలతోపాటు ఉన్న నందకుమార్ అనే వ్యక్తి మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు.
నందకుమార్ అనే వ్యక్తి ఫాంహౌస్ నుంచి మాట్లాడుతూ.. పూజ కోసం వచ్చామంటూ సైగల ద్వారా చెప్పారు. పూజ కోసం పూజ కోసమే వచ్చామని తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లు, డబ్బులు అంటూ ప్రచారం జరుగుతోందనగా.. తమకు తెలియదన్నట్లుగా స్పందించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ యత్నం..పట్టుబడ్డ నలుగురు ఎమ్మెల్యేలు..!! pic.twitter.com/ERpbVI1r0U
— oneindiatelugu (@oneindiatelugu) October 26, 2022
అర్ధరాత్రి పీఎస్‌కు తరలించారు
కాగా, అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఫాంహౌస్ నుంచి నందకుమార్, స్వామిజీ సింహయాజీలను పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరో స్వామిజీ రామచంద్ర భారతిని కూడా తరలించనున్నట్లు సమాచారు. వీరిని పోలీసులు హౌంహౌస్‌లో విచారించినట్లు తెలుస్తోంది.
మరోవైపు టీఆర్ఎస్ ఆందోళనలు
తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పరుస్తున్నారంటూ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నాయి. ప్రగతిభవన్ ఎదుట కేంద్రం దిష్టిబొమ్మలు దహనం చేశారు. చౌటుప్పల్ వద్ద మంత్రులు, టీాఆర్ఎస్ నేతలు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.

అంతకుముందు జరిగిన పరిణామాలు ఇలా..
మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో నేతలు పార్టీలు మారుతున్న విషయం తెలిసిందే. తాజాగా, ఢిల్లీకి చెందినట్లుగా చెబుతున్న వ్యక్తులు హైదరాబాద్‌లో నోట్ల కట్టలతో పట్టుపడటం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. వారు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వీరు రంగంలోకి దిగారనే పక్కా సమాచారంతో పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతోపాటు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించేందుకు ఢిల్లీకి చెందిన వ్యక్తులు వచ్చినట్లు సమాచారం అందిందని పోలీసులు చెప్పారు.
గత రెండ్రోజులుగా ఈ నలుగురూ.. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నిస్తు నేపథ్యంలో పక్కా సమాచారంతో తెలంగాణ పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుగుతున్న సమయంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారనే సమాచారం తమకు వచ్చిందని, ప్రలోభాల ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే ప్రత్యేక ఆపరేషన్ చేపట్టామని తెలిపారు.
డబ్బు, పదవులు, కాంట్రాక్టులతో ప్రలోభపెడుతున్నారన్నారు సీపీ స్టీఫెన్ రవీంద్ర. ఫరీదాబాద్ ఆలయానికి చెందిన రామచంద్ర భారతి, తిరుపతికి చెందిన సింహయాజీ అనే స్వామిజీ.. హైదరాబాద్ కు చెందిన నందకుమార్‌తో కలిసి వచ్చారని సీపీ తెలిపారు. ఈ వ్యవహారంపై లీగల్ యాక్షన్ తీసుకుంటామన్నారు. మరిన్ని వివరాలు దర్యాప్తు అనంతరం చెబుతామన్నారు.












Click it and Unblock the Notifications