కంటతడి: కడసారి చూసేందుకు వచ్చిన హరికృష్ణ సతీమణి శాలిని, వెంటవచ్చిన లక్ష్మీప్రణతి
హైదరాబాద్: నార్కట్‌పల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన టీడీపీ సీనియర్ నేత, సినీ నటుడు హరికృష్ణ భౌతికకాయాన్ని నగరంలోని మెహిదీపట్నంలోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. హరికృష్ణ పార్థీవదేహాన్ని చూసేందుకు ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు.
హరికృష్ణను కడసారి చూసేందుకు ఆయన భార్య శాలిని, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీప్రణతి, హరికృష్ణ సోదరి పురంధేశ్వరి, బాలకృష్ణ, తారకరత్న, ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి తదితరులు హరికృష్ణ నివాసానికి చేరుకున్నారు. పలువరు ఏపీ, తెలంగాణ మంత్రులు వచ్చారు.

Recommended Video

తన భర్త హరికృష్ణ ఇక లేరనే వార్తతో ఎన్టీఆర్ తల్లి శాలిని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఏడుస్తున్న ఆమెను లక్ష్మీప్రణతి చేయి పట్టుకుని ఇంటిలోకి తీసుకెళ్లారు. కాగా, మరికాసేపట్లో తెలంగాణ సీఎం కేసీఆర్.. హరికృష్ణ పార్థీవ దేహానికి నివాళులర్పించేందుకు ఆయన నివాసానికి రానున్నారు.












Click it and Unblock the Notifications