లోకేష్ డ్రైవర్ డుమ్మా, ఎసిబి మళ్లీ: కెటిఆర్ గన్‌మెన్‌ని వెతికే పనిలో ఏపీ సీఐడీ
హైదరాబాద్/విజయవాడ: ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ డ్రైవర్ కొండల్ రెడ్డికి తెలంగాణ ఎసిబి అధికారులు బుధవారం నాడు నోటీసులు ఇచ్చారు. అయితే, కొండల్ రెడ్డి ఎసిబి ఎదుట హాజరు కాలేదు.
తమ ఎదుట గురువారం నాడు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. కానీ ఆయన హాజరు కాలేదు. దీంతో కొండల్ రెడ్డికి మరోసారి నోటీసులు ఇచ్చే యోచనలో ఎసిబి ఉంది.
కెటిఆర్ డ్రైవర్ అడ్రస్ వెతుకులాటలో ఏపీ సిఐడి!
జెరూసలేం మత్తయ్య కేసులో తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు డ్రైవర్, గన్‌మెన్‌కు నోటీసులు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ సిఐడి ప్రయత్నాలు చేస్తోంది. గురువారం నాడు కూడా ఐఎస్‌డబ్ల్యూ కార్యాలయం వద్ద సిఐడి కెటిఆర్ డ్రైవర్ కోసం ఆరా తీసింది. వారు ఎక్కడున్నారో తెలియక.. అడ్రస్ వెతుకులాటలో పడినట్లుగా తెలుస్తోంది.

కాగా, ఓటుకు నోటు వ్యవహారంలో ఎసిబి ముందడుగును బట్టి ఏపీ సీఐడీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో వేగం పెంచుతోందని చెప్పవచ్చు. ఇందులో భాగంగానే లోకేష్ డ్రైవర్ కొండల్ రెడ్డికి టి ఎసిబి నోటీసులు ఇవ్వగా, ప్రతిగా కెటిఆర్ డ్రైవర్, గన్‌మెన్‌కు నోటీసులు ఇచ్చేందుకు ఏపీ సిఐడి ప్రయత్నాలు చేస్తోంది.
బుధవారం నాడు కూడా వారు నోటీసులు ఇవ్వకుండానే వెళ్లిపోవాల్సి వచ్చింది. మత్తయ్య ఫిర్యాదు మేరకు అని చెప్తూ కెటిఆర్ గన్‌మెన్ జానకీ రాం, డ్రైవర్ సత్యనారాయణకు బుధవారం రాత్రి సీఆర్‌పీసీ 160 సెక్షన్ ప్రకారం నోటీసులు ఇచ్చేందుకు విజయవాడ సీఐడీ బృందం, విశాఖ సీఐడీ బృందం హైదరాబాద్ వచ్చాయి.
సీఎం క్యాంప్ కార్యాయలంలో కేటీఆర్ గన్‌మెన్ జానకీరాం, డ్రైవర్ సత్యనారాయణకు ఇచ్చేందుకు బుధవారం రాత్రి చేరుకున్నారు. అయితే సీఎం క్యాంప్ కార్యాయలంలోకి అనుమతి లేదని, జానకీరాం, సత్యనారాయణ అనే పేర్లతో ఇక్కడ ఎవరూ పనిచేయడం లేదని బందోబస్తులో ఉన్న సీఐడీ అధికారులకు తేల్చిచెప్పారు.
దీంతో అక్కడినుంచి వెనుదిరిగిన సీఐడీ బృందాలు నేరుగా బంజారాహిల్స్‌లోని కేసీఆర్ పాత ఇంటికి చేరుకున్నారు. అక్కడ కూడా ఆ పేర్లతో ఎవరూ పనిచేయడం లేదని సమాధానం రావడంతో విజయవాడ సీఐడీ బృందం వెనుతిరిగింది.












Click it and Unblock the Notifications