నరేంద్ర మోడీ మాకు ముందే చెప్పినా బాగుండేది: నారా రోహిత్, జగన్‌కే కౌంటరా?
ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు అంశంపై తమకు ముందుగా చెప్పినా బాగుండేదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడి కొడుకు, ప్రముఖ నటుడు నారా రోహిత్ వ్యాఖ్యానించారు.
విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు అంశంపై తమకు ముందుగా చెప్పినా బాగుండేదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడి కొడుకు, ప్రముఖ నటుడు నారా రోహిత్ వ్యాఖ్యానించారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దును ప్రకటించిన విషయం తెలిసిందే. రూ.500, రూ.1000 నోట్ల రద్దును ఆయన ప్రకటించారు.

నోట్ల రద్దు ప్రకటన తదనంతర పరిణామాల పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబుకు నోట్ల రద్దు అంశం ముందుగానే తెలుసునని, అందుకే ఆయన తన హెరిటేజ్ షేర్లు అమ్ముకున్నారని ఆరోపించారు.
దీనిని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. తాజాగా ఇదే అంశంపై నారా రోహిత్‌ను అడిగారని తెలుస్తోంది.
పెద్ద నోట్ల రద్దు గురించి తమకు ముందే తెలిసిపోయిందని, మేం ముందుగా డబ్బులు మార్చేసుకున్నామని వార్తలు వచ్చాయని, నిజంగా అలా తెలిసినా బాగుండేదని ఎద్దేవా చేశారు. ఆ వ్యాఖ్యలు వైసిపి అధినేతకి, ఆ పార్టీ అధినేతకే తగులుతాయని అంటున్నారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications