నమ్మించి యువతిపై పలుమార్లు లైంగికదాడి
నల్లగొండ: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి బాలికను మోసం చేసిన యువకుడిపై కేతేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ బాలగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం - కేతేపల్లి మండలంలోని భీమారం గ్రామానికి చెందిన నెమ్మాది నరేష్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికను ఏడు నెలలుగా ప్రేమిస్తున్నాడు.
ఈ క్రమంలో బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి బలవంతంగా పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకోవాలని బాలిక నరేష్‌పై ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో ఆగ్రహించిన నరేష్ బాలికను శారీరకంగా వేధిస్తున్నాడు. అంతే కాకుండా పలువురు గ్రామస్తులతో అక్రమ సంబంధాలున్నాయని, తనకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదని అనుమానిస్తున్నాడు.

ఈ విషయమై పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టినప్పటికీ నరేష్ ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో తనకు న్యాయం జరిపించాలంటూ బాలిక పోలీసులను ఆశ్రయించింది. బాలిక ఫిర్యాదు మేరకు నిందితుడు నరేష్‌పై మైనర్ చట్టం, లైంగిక దాడి, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఖమ్మం జిల్లా పాల్వంచ పట్టణంలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దొంగలు 200 తులాల బంగారం, రెండు కిలోల వెండి, యూఎస్ డాలర్లను అపహరించుకువెళ్లారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా వీపనగండ్ల మండలం కొప్పునూరులో విషాదం అలముకుంది. ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. మృతుల్లో ఓ మహిళతోపాటు ఇద్దరు చిన్నారులున్నారు. సాయిలీల(30), గణేశ్ (6), దీపిక (4)ల మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు.












Click it and Unblock the Notifications