హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆటపాటలతో ముగిసిన యోగా పోటీలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జాతీయస్థాయి యోగాసనాల క్రీడా పోటీలు సోమవారం రాత్రితో ఆటపాటలతో ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. యోగా విన్యాసాలను చూసి మీకు అభిమానులం అయ్యాయమని అన్నారు. యోడా క్రీడలను తెలంగాణ రాష్ట్రంలో ప్రోత్సహించడానికి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలను అందిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో యోగా విద్యను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని హోంమంత్రి నాయిని చెప్పారు.

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం ప్రధాని నరేంద్రమోడీ కృషి ఉందని ముషీరాబాద్ ఎమ్మెల్యే లక్ష్మణ్ అన్నారు. ఈ సందర్భంగా పలువురు చేసిన యోగాసనాలు అబ్బురపర్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, చింతల రామచంద్రారెడ్డి, తెలంగాణ యోగా అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, కార్యదర్శి మనోహర్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ రెడ్డి దైవజ్ఞశర్మ తదితరులు పాల్గొన్నారు.

విజేత పశ్చిమబెంగాల్

విజేత పశ్చిమబెంగాల్

హైదరాబాద్‌లో జరిగిన జాతీయ యోగా ఛాంపియన్ షిప్‌లో విజేతగా నిలిచిన పశ్చిమ బెంగాల్.

ఓవరాల్ రన్నర్ హర్యానా

ఓవరాల్ రన్నర్ హర్యానా

హైదరాబాద్‌లో జరిగిన జాతీయ యోగా ఛాంపియన్ షిప్‌లో రన్నరప్‌గా నిలిచిన హర్యానా.

ఓవరాల్ ఛాంపియన్ మహారాష్ట్ర

ఓవరాల్ ఛాంపియన్ మహారాష్ట్ర

హైదరాబాద్‌లో జరిగిన జాతీయ యోగా ఛాంపియన్ షిప్‌లో ఓవరాల్ విజేతగా నిలిచిన మహారాష్ట్ర.

ఆటపాటలు

ఆటపాటలు

యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జాతీయస్థాయి యోగాసనాల క్రీడా పోటీలు సోమవారం రాత్రితో ఆటపాటలతో ఘనంగా ముగిశాయి.

ఆటపాటలు

ఆటపాటలు

ఆటపాటలుఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఆటపాటలు

ఆటపాటలు

ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. యోగా విన్యాసాలను చూసి మీకు అభిమానులం అయ్యాయమని అన్నారు.

English summary
National Yoga Championship finished in Hyderabad on Monday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X