షాకింగ్, బిగ్ షాట్స్ పేరు చెప్పిన నవదీప్: విదేశీ డ్రగ్ మాఫియాతో లింక్, అగ్రహీరోలు, హీరోయిన్లు
నటుడు నవదీప్ సిట్ విచారణలో కీలక విషయాలు వెల్లడించారని తెలుస్తోంది. సినీ రంగంలో పలువురు ప్రముఖ హీరోలు, హీరోయిన్లు డ్రగ్స్‌కు బానిస అయ్యారని ఆయన సిట్ ముందు వెల్లడించారని సమాచారం.
హైదరాబాద్: నటుడు నవదీప్ సిట్ విచారణలో కీలక విషయాలు వెల్లడించారని తెలుస్తోంది. సినీ రంగంలో పలువురు ప్రముఖ హీరోలు, హీరోయిన్లు డ్రగ్స్‌కు బానిస అయ్యారని ఆయన సిట్ ముందు వెల్లడించారని సమాచారం.
చదవండి: చార్మిపై ఏం చేద్దాం:డిజిపితో అకున్, ప్రశ్నలతో నవదీప్ ఉక్కిరి
అదే సమయంలో, నవదీప్ గురించి కూడా సిట్ అధికారులు షాకింగ్ విషయాలు రాబట్టారని తెలుస్తోంది. నవదీప్‌కు ఏకంగా విదేసీ డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని దర్యాఫ్తు అధికారులు గుర్తించారని తెలుస్తోంది.

హీరోలు, హీరోయిన్లు.. కొత్త పేర్లు బయటపెట్టిన నవదీప్
సిట్ విచారణలో నటుడు నవదీప్ కొత్త పేర్లు బయటపెట్టారని తెలుస్తోంది. ఈ సందర్భంగా అతను కొందరి పేర్లు చెప్పాడని సమాచారం. పరిశ్రమలో కొన్నాళ్ల నుంచి ఉన్న హీరోలు డ్రగ్స్‌కు బానిస అయ్యారని చెప్పాడని తెలుస్తోంది. ఈ మేరకు పలువురు హీరోలు, హీరోయిన్ల పేరు ఆయన సిట్ ఎదుట వెల్లడించాడని సమాచారం. కొందరు అగ్ర హీరోలు, అగ్ర హీరోయిన్లు డ్రగ్స్ తీసుకున్నారని సమాచారం ఉందని చెప్పాడని తెలుస్తోంది.
Recommended Video


విదేశీ డ్రగ్ మాఫియాతో నవదీప్‌కు లింక్, నేరుగా అక్కడి నుంచే..
నటుడు నవదీప్‌కు ఇతర దేశాల డ్రగ్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని విచారణలో సిట్ అధికారులు గుర్తించారని తెలుస్తోంది. ఇతర దేశాల నుంచి నేరుగా తన వద్దకే డ్రగ్స్ తెప్పించుకునే వాడని గుర్తించారని సమాచారం. పలు దేశాల డ్రగ్ మాఫియాతో అతనికి సంబంధముందని తెలుస్తోంది. విదేశీ ఏజెంట్ల లింకులపై ఆరా తీసే ప్రయత్నాలు చేశారని సమాచారం.

పరిశ్రమలో డ్రగ్ వ్యవహారం ఎలా నడుస్తుందో చెప్పిన నవదీప్
పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం ఎలా నడుస్తుందో నటుడు నవదీప్ విచారణలో వెల్లడించారని తెలుస్తోంది. ఈ మేరకు తనకు తెలిసిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడని సమాచారం.

సినీ పరిశ్రమకు సంబంధించి కొత్త విషయాలు
సినీ పరిశ్రమకు సంబంధించి కూడా అతను పలు కొత్త విషయాలు వెల్లడించాడని తెలుస్తోంది. పబ్బుల్లో డ్రగ్స్ వాడకం సర్వ సాధారణమని తెలిపారు. చాలామంది ఈ డ్రగ్స్‌కు బానిస అయ్యారని తెలిపారు.












Click it and Unblock the Notifications