నయీం ఎన్‌కౌంటర్: ఆ ఎమ్మెల్యే టార్గెట్, బెదిరింపు, అసలేం జరిగింది?
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ ఎన్‌కౌంటర్లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీం ఆగడాల పైన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఎమ్మెల్యేల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేను నయీం టార్గెట్ చేశాడని చెబుతున్నారు.
నయీం బాధితుల్లో పలువురు తెరాస నేతలు కూడా ఉన్నారు. నయీం నుంచి ప్రాణహానీ ఉండటంతో భువనగిరి ఎమ్మెల్యేకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రభుత్వం కేటాయించింది. నయీం ఆగడాల పైన భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సీఎంకు ఫిర్యాదు చేశారు.
తన సోదరుడు అలీభాయ్ ఉత్సవ కమిటి పేరుతో నిర్వహించే వినాయకుడి ఉత్సవాలకు రావాలని తెరాస ఎమ్మెల్యేలకు నయీం గతంలోనే అల్టిమేటం జారీ చేశారని అంటారు. దీనిని పైఇద్దరు ఎమ్మెల్యేలు తిరస్కరించారు. నయీం పలువురు ప్రజాప్రతినిధులను టార్గెట్ చేశారని అంటున్నారు.
గ్రేహౌండ్స్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌కు దారి తీసిన కారణాలు ఆసక్తికరంగా ఉన్నాయని అంటున్నారు. దందాలకు పాల్పడే నయీం భువనగిరి ఎమ్మెల్యే శేఖర రెడ్డిని బెదిరించి, తన అనుమతిలేనిదో నియోజకవర్గంలో అడుగు పెట్టవద్దని హెచ్చరించాడని అంటుంటారు. ఈ వేధింపుల వల్ల మరికొంతమంది ప్రజాప్రతినిధులకు ఎదురయ్యాయి. దీంతో వారు సీఎంకు ఫిర్యాదు చేశారు. అప్పటికే నయీం కార్యకలాపాలపై గుర్రుగా ఉన్న గ్రేహౌండ్స్ బలగాలు.. కేసీఆర్ నుంచి ఆదేశాలు రాగానే రంగంలోకి దిగాయని చెబుతున్నారు.
కాగా, ఈ కాల్పుల్లో మృతి చెందింది నయీమా లేక అతని అనుచరుడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నయీం మృతి చెందినప్పటికీ.. స్థానికులు మాత్రం అతను ఎవరో తెలియడం లేదని చెబుతున్నారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పోలీసులు మాత్రం నయీమే హతమైనట్లుగా చెబుతున్నారు. కాగా, నయీం మృతదేహం పక్కనే మహిళా మృతదేహం ఉండటంతో ఉగ్రలింకులు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నయీం
నయీం తలదాచుకున్న భవనంలో కాకుండా ఆ భవనానికి కాస్త దూరంలో అతని మృతదేహం పడి ఉంది. పోలీసుల రాకను గమనించిన నయీం అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నంలో భాగంగా, ఎదురు కాల్పల్లో భాగంగా పోలీసుల తూటాలు తగిలి చనిపోయాడని భావిస్తున్నారు.

కొండా విశ్వేశ్వర రెడ్డి
నయీం ఎన్ కౌంటర్ పైన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి స్పందించారు. షాద్ నగర్లో జరిగిన ఎన్ కౌంటర్లో నయీం మృతి చెందాడన్నారు. షాద్ నగర్లో రేగిన కలకలం తొలుత ఉగ్రవాదులదిగా భావించినా, అక్కడ తలదాచుకున్నది నయీం అని తేలిందన్నరాు. పోలీసుల కాల్పుల్లో నయీం చనిపోయాడన్నారు.

తుపాకీ
నయీం ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో పోలీసులు పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అందులో నాలుగు రివాల్వర్లు ఉన్నాయి.

నయీం
ఉన్నతాధికారులతో సాన్నిహిత్యం, కోవర్టు జీవితం గడిపిన నయీముద్దీన్ పేరు.. భువనగిరిలో బెల్లి లలిత దారుణ హత్యతో రాష్ట్రవ్యాప్తంగా పేరు మార్మోగింది.












Click it and Unblock the Notifications