నయీం సొంత చెల్లిని, బావను కూడా చంపేశాడు, రాష్ట్రంలో 20 డెన్‌లు

హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీంకు చెందిన ఎన్నో కోణాలు వెలుగు చూస్తున్నాయి. భూకబ్జాలు, అక్రమ సంపాదనకు పాల్పడిన నయీం ఏకంగా తన చెల్లిని, బావను కూడా చంపేశాడు. పలువురిని అదను దారుణంగా హత్య చేశాడు. తెలుగు రాష్ట్రాలు, ఛత్తీస్‌గఢ్‌లో సెటిల్మెంట్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 20 ఇళ్లను డెన్‌లుగా మార్చుకున్నాడు.

అతను మారువేషాల్లో తిరిగేవాడని, ఆడవారి వేషధారణలో కూడా తిరిగేవాడని విచారణలో వెల్లడవుతున్నాయి. దర్యాఫ్తుకు చెందిన చర్చిచేందుకు సిట్ అధిపతి నాగిరెడ్డి.. రాజేంద్రనగర్‌లోని ఏసీపీ కార్యాలయంలో నల్గొండ, మహబూబ్‌నగర్‌, సైబరాబాద్‌ తూర్పు, పశ్చిమ కమిషనరేట్ల పోలీసులతో సమావేశమయ్యారు.

ఐదు గంటలపాటు సుదీర్ఘంగా సమావేశమైన అనంతరం, కొన్ని విషయాలను ఆయన విలేకరులకు వెల్లడించారు. నయీంపై ఇప్పటి వరకూ కంట్రోల్‌ రూంకు 60 ఫిర్యాదులు అందాయనీ, అయితే వాటిలో కొన్ని అసలైనవి కాకపోవడంతో పక్కన పెట్టామన్నారు.

Nayeem

నయీం చంపిన వారిలో అతని బావ నదీం అలియాస్‌ ఉదయ్ కుమార్‌, చెల్లెలు సస్రీన్‌పాటు షియాన్‌, మరోవ్యక్తి ఉన్నారన్నారు. తెలుగు రాష్ట్రాలు, ఛత్తీస్‌గఢ్‌ తదితర సరిహద్దు రాష్ట్రాల్లో నయీం ఆధిపత్యం అధికంగా కొనసాగిందని, భూ ఆక్రమణ వ్యాపారంలోనే నయీం ఎక్కువగా కలుగజేసుకున్నట్లు స్పష్టమవుతోందన్నారు.

నార్సింగి, షాద్‌నగర్‌, వనస్థలిపురం, భువనగిరి ప్రాంతాల నుంచి వస్తున్న ఫిర్యాదులు అధికంగా ఉన్నాయి. నయీంకు ఒక్క తెలంగాణలోనే ఇరవై ఇళ్లు ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించామనీ, వీటిల్లో పూర్తిస్థాయి సోదాలకు న్యాయస్థానం నుంచి అనుమతి కోరతామని తెలిపారు.

పహాడీషరీఫ్‌ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదులు

మహేశ్వరం మండలం ఇమాంగూడలో ఉండే యాదగిరి రెడ్డి, రాంరెడ్డిలు నయీం తమను బెదిరించాడంటూ పహడీ షరీఫ్‌ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నయీం తగాదాలు సృష్టించాడనీ, తమపై జులుం చేశాడంటూ పదుల సంఖ్యలో మరికొందరు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఆధారాలుంటేనే కేసును నమోదు చేస్తామని వారికి పోలీసులు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+