పెళ్ళై మూడురోజులే నవవధువు చనిపోయింది, కారణమిదే!
పెళ్ళైన మూడురోజులకు వధువు మరణించింది.ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకొంది. ప్రమాదవశాత్తు కృష్ణానదిలో మునిగి వధువు మరణించిందని కుటుంబసభ్యులు తెలిపారు.
మఠంపల్లి: పెళ్ళైన మూడురోజులకు వధువు మరణించింది.ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకొంది. ప్రమాదవశాత్తు కృష్ణానదిలో మునిగి వధువు మరణించిందని కుటుంబసభ్యులు తెలిపారు.
వివాహం తర్వాత మఠంపల్లి మండలంలోని మట్టపల్లి వద్ద ఉన్న శ్రీలక్ష్మీ నర్సింహ్మస్వామిని దర్శించుకొనేందుకు నూతన వధూవరులు దీపిక, సాయి ఆదివారం నాడు వచ్చారు.
మిర్యాలగూడ మండలంలోని ఆలగడపకు చెందిన సాయికి, నేరేడుచర్ల మండలానికి చెందిన దీపికకు మూడు రోజుల క్రితం వివాహమైంది. వివాహమైన తర్వాత మట్టపల్లి శ్రీలక్ష్మీనర్సింహ్మస్వామిని దర్శించుకొనేందుకు వెళ్ళారు.

కుటుంబసభ్యులతో కలిసి నర్సింహస్వామిని దర్శించుకొని నదిలోకి దంపతులు స్నానానికి దిగారు. అయితే లోతు ఎక్కువగా ఉండడంతో నవవధువు మునిగిపోయింది. బంధువులు వెంటనే అప్రమత్తమై ఆమెను బయటకు తీశారు. కొనఊపిరితో ఉన్న దీపికను దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్ళారు.
అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు ధృవీకరించారు. పెళ్ళి కూతురు దీపిక మరణించడంతో ఈ రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.












Click it and Unblock the Notifications