ఓరుగల్లు వాసులకు కొత్త భయం.. ఎవర్ని చూసినా అనుమానం!!
ఓరుగల్లు వాసులకు ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. కొత్తవారిని ఎవరిని చూసినా జిల్లా ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో తాజాగా జరుగుతున్న ప్రచారం చిన్నారులకు, చిన్నపిల్లల తల్లిదండ్రులకు నిద్రలేకుండా చేస్తుంది. అసలు ఇంతకీ వరంగల్ జిల్లాలో జరుగుతున్న ప్రచారం ఏంటి? అందులో నిజం ఎంత? వాటి వివరాల్లోకి వెళితే..
వరంగల్ జిల్లాలో పిల్లల కిడ్నాప్ ముఠాలు సంచరిస్తున్నాయి అన్న వార్త ప్రస్తుతం హల్చల్ చేస్తుంది. అందులో వాస్తవం ఎంత అనేది పక్కన పెడితే కొత్త వ్యక్తులు కనబడితే చాలు పిల్లలు కేకలు పెడుతూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కిడ్నాప్ ముఠాలు వరంగల్ జిల్లాలో సంచరిస్తున్నాయి అని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో పిల్లల తల్లిదండ్రులు కూడా భయపడిపోతున్నారు.

తాజాగా రాయపర్తి మండలం బురహాన్ పల్లి ప్రభుత్వ పాఠశాల వద్ద బుర్కా ధరించిన ఇద్దరు స్కూల్ పిల్లలను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని, స్కూల్ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇద్దరు మహిళలతో సహా మొత్తం నలుగురు వ్యక్తులు ఆటోలో వచ్చి స్కూల్ విద్యార్థులను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం చేయగా, వారిని చూసిన విద్యార్థులు కేకులు పెడుతూ అక్కడి నుంచి పరుగులు పెట్టారు. దీంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇక ఆ తర్వాత వరంగల్ అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో కూడా స్కూల్ నుండి ఇంటికి వెళ్తున్న ఒక విద్యార్థిని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసే ప్రయత్నం చేయగా బాలుడు భయంతో కేకలు పెడుతూ స్కూల్ లోకి పరుగులు పెట్టాడు. ఇది తెలిసిన ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.
అయితే వరుస ఘటనల నేపథ్యంలో కిడ్నాప్ ముఠాలు తిరుగుతున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు, పిల్లలు ఆందోళన చెందుతున్నారు. ఇక పోలీసులు సైతం భద్రత నిమిత్తం ప్రతి ఒక్కరు కాలనీలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications