వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం టీఆర్ఎస్‌లో ప్రారంభమైనా.. సమీకరణాలు సరిగ్గా కుదరకపోవడంతో శాసనమండలి పునరుద్ధరణ తర్వాత ఇండిపెండెంట్‌గా గెలుపొంది టీడీపీలో చేరారు. 2009లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన రేవంత్ రెడ్డి 2014 ఎన్నికల వరకు సాధారణంగానే వ్యవహరించారు.

Recommended Video

Revanth Reddy Speech at Congress Praja Garjana Meet

తెలంగాణ ఏర్పాటైన తర్వాత అధికార టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ లక్ష్యంగా వ్యవహరిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. 2015లో ఎమ్మెల్సీ కోటాలో ఓటుకు నోటు కేసులో చిక్కుకున్న రేవంత్ రెడ్డి జైలు జీవితం కూడా గడిపారు. నాటి నుంచి సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్న రేవంత్ తనకంటూ తెలంగాణలో ప్రత్యేక ఇమేజీ సంపాదించుకున్నారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ - కాంగ్రెస్ పార్టీ మధ్య పొత్తు కోసం ప్రయత్నిస్తుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుచక్రం వేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో పొత్తు ఉంటుందని సంకేతాలివ్వడంతో సుమారు 15 మంది నేతలతో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు.

New maker 2017: Revanth Reddy
English summary
News maker Congress leader Revanth Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X