ఇకపై తెలంగాణాలో డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే.. ఇలా చెయ్యాలి!

తెలంగాణ రవాణా శాఖలో డ్రైవింగ్ లైసెన్స్ జారీలో జరుగుతున్న అక్రమాలను అరికట్టడానికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఏసీబీ నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో అభ్యర్థులు హాజరు కాకుండానే లైసెన్సులు ఇవ్వడం, ప్రైవేట్ ఏజెంట్లు మరియు బ్రోకర్ల హల్చల్, ఉన్నతాధికారుల తనిఖీల సమాచారం లీక్ చేయడం వంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి.

డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాల్లో కొత్త మార్గదర్శకాలు

ఈ నేపథ్యంలో జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఎం. చంద్రశేఖర్ గౌడ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాల్లో పూర్తి పారదర్శకతను నిర్ధారించేందుకు కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై "టెస్ట్ పాస్ అయితేనే లైసెన్స్" అనే సూత్రం కఠినంగా అమలు చేయనున్నారు. ప్రతి అభ్యర్థి తనకు కేటాయించిన తేదీన డ్రైవింగ్ ట్రాక్‌కు వ్యక్తిగతంగా హాజరు కావాలి.

new rules for driving license Telangana Transport Department strict rules for driving licenses

ఇవన్నీ చేస్తేనే డ్రైవింగ్ లైసెన్స్

పరీక్ష ప్రారంభం ముందు ఆధార్ కార్డు లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డు ద్వారా బయోమెట్రిక్ గుర్తింపు తప్పనిసరి. వాహనాన్ని స్టార్ట్ చేయడం, ఆపడం, రివర్స్ తీయడం, సిగ్నల్స్ పాటించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వంటి ప్రాథమిక నైపుణ్యాలను అభ్యర్థి తప్పనిసరిగా ప్రదర్శించాలి. కేవలం స్టీరింగ్ పట్టుకుని కూర్చోవడం ద్వారా పాస్ మార్కులు ఇచ్చే పాత పద్ధతులను పూర్తిగా నిషేధించారు.

డ్రైవింగ్ ట్రాక్ పై సీసీ కెమెరాలు

డ్రైవింగ్ ట్రాక్‌లపై సీసీటీవీ కెమెరాలు నిరంతరం పని చేయాలి. నిఘా వ్యవస్థను ఆపడం లేదా రికార్డింగ్‌లను హ్యాక్ చేయడం వంటి చర్యలను తీవ్ర నేరంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటారు. ఏజెంట్లు, బ్రోకర్లు, డ్రైవింగ్ స్కూల్ ప్రతినిధులు ఎవరూ ఆర్టీవో కార్యాలయాలు లేదా టెస్ట్ ట్రాక్‌ల పరిధిలోకి రాకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.ఈ చర్యల ద్వారా లైసెన్స్ జారీ ప్రక్రియలో పారదర్శకత వస్తుందని భావిస్తున్నారు.

తెలంగాణాలో తెరచుకున్న స్కూల్స్.. నేటి నుండే అల్పాహార పథకం.. పండుగే!
తెలంగాణాలో తెరచుకున్న స్కూల్స్.. నేటి నుండే అల్పాహార పథకం.. పండుగే!

ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులపై చర్యలు

అర్హులైన అభ్యర్థులు మాత్రమే లైసెన్సులు పొందే వాతావరణం ఏర్పడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, సురక్షిత డ్రైవింగ్ అలవాట్లను ప్రోత్సహించడం ఈ సంస్కరణల ముఖ్య లక్ష్యం. రవాణా శాఖ ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తుందని, ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది.ఈ కొత్త వ్యవస్థతో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే యువతీ, యువకులు నిజమైన నైపుణ్యం సాధించి లైసెన్స్ పొందేందుకు అవకాశం లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+