జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్ వేళ కొత్త ట్విస్ట్, అంతు చిక్కని సైలెంట్ ఓటింగ్.. అక్కడే గెలుపు..!!
జూబ్లీహిల్స్ లో పోలింగ్ ముగిసింది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కే అనుకూలంగా ఇచ్చాయి. ఇక తమదే గెలుపు అంటూ కాంగ్రెస్ మెజార్టీ లెక్కలు వేస్తోంది. పోలింగ్ తరువాత బీఆర్ఎస్ కే ఓటర్లు అనుకూల తీర్పు ఇచ్చారంటూ ఆ పార్టీ నేతలు విశ్లేషణ చేస్తున్నారు. బీజేపీకి మాత్రం గతం కంటే ఈ సారి ఓటింగ్ తగ్గినట్లు సర్వే సంస్థలు చెబుతున్నాయి. బీజేపీకి తగ్గిన ఓటు ఎవరికి మళ్లింది. అదే విధంగా సర్వేకు అంతుచిక్కని విధంగా కొంత ఓటింగ్ ఉన్నట్లు ప్రధాన పార్టీలు అంగీకరిస్తు న్నాయి. మరి.. ఆ ఓటింగ్ ఎవరికి మళ్లింది.. డివిజన్ల వారీగా పార్టీల లెక్కలు ఏంటీ.. ఇప్పుడు ఇదే అసలు ఫలితంలో కీలకంగా మారబోతోంది...
ప్రతిష్ఠాత్మకంగా మారిన జూబ్లీహిల్స్ పోరులో ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. కాంగ్రెస్ కే ఓటర్లు పట్టం కట్టారని మెజార్టీ సంస్థలు తేల్చాయి. రెండు నుంచి ఎనిమిది శాతం వరకు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కంటే ఆధిక్యత ఉంటుందని అంచనా వేసాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 48.24 శాతం పోలింగ్ జరిగింది. కాంగ్రెస్ తొలి నుంచి ఇక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరించటంతో పాటుగా ఎంఐఎం మద్దతుతో ఓటింగ్ శాతం పెరిగినట్లు కనిపిస్తోంది.

అదే సమయంలో బీఆర్ఎస్ ఓటింగ్ కొంత కోల్పోయినట్లు అర్దమవుతోంది. ఇక.. బీజేపీకి గత ఎన్నికల్లో 14 శాతం ఓటింగ్ వచ్చింది. ఉప ఎన్నికల్లో మా త్రం అన్ని ఎగ్జిట్ పోల్స్‌కు 14 శాతం నుంచి 6 శా తానికి తగ్గినట్లు ఎగ్జిట్ పోల్స్ లెక్కలు చబుతున్నాయి. ఈ లెక్కన దదాపు గా 8 శాతం ఓట్లు క్రాస్ అయ్యాయి. అంటే సగానిపైగా ఓట్లు ఇతర పార్టీలకు బదిలీ అయ్యాయి. ఈ ఓటు ఎటు ఏకపక్షంగా కాంగ్రెస్ వైపు మళ్లిందా లేక, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు చెరింత చీల్చుకున్నాయా అనేదే తుది ఫలితంలో కీలకం కానుంది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో 47 శాతం పోలింగ్ నమోదైతే ఇప్పుడు అది 48.24 శాతానికి పెరిగింది. అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. పెరిగిన ఈ ఓటింగ్ కూడా గెలుపును డిసైడ్ చేసే ఫ్యాక్టర్‌గా మారనుంది. తగ్గిన బీజేపీ ఓట్ షేర్ ఏకపక్షంగా కాకుండా.. కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య చీలి ఉండే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం. బీజేపీ ఓటు ఎవరికి ఎక్కవగా టర్న్ అయితే ఆ పార్టీకి మెజార్టీ ఖాయంగా కనిపిస్తోంది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ 4 నుంచి 5 శాతం వరకు కాంగ్రెస్ కు లీడ్ ఉన్నట్లు మెజార్టీ అభిప్రాయపడ్డాయి.

ఎర్రగడ్డలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు సమానంగా ఓట్లు పడ్డాయని, బోరుబండలో తమకే అధిక్యం ఉంటుందని చెబుతున్న బీఆర్ఎస్ నేతలు.. షేక్ పేటలో వచ్చే మెజార్టీ మిగిలిన ప్రాంతాల్లో వచ్చిన నష్టం భర్తీ చేస్తుందని విశ్లేషిస్తున్నారు. కాగా, రెండు శాతం వరకు ఏ పార్టీకీ.. సంస్థకు అంతు చిక్కని సైలెంట్ ఓటింగ్ జరిగిందని పార్టీలు లెక్క లు వేస్తున్నాయి. దీంతో.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా.. తుది ఫలితం ఏంటనేది మరింత ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications