తల్లిదండ్రులకు కడుపు కోత: 9 నెలల చిన్నారి మృతి (ఫొటోలు)
హైదరాబాద్: అకారణంగా 9 నెలల బాలుడి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిశాయి. డ్రెసింగ్ టేబుల్ మీద పడడంతో అతను మరణించాడు. ఈ సంఘటన గురువారంనాడు హైదరాబాదులోని రాంనగర్‌లో చోటు చేసుకుంది. మృతుడిని ఆయన్‌గా గుర్తించారు. తల్లిదండ్రులకు ఆ చిన్నారి కడుపుకోతను మిగిల్చాడు.

ఆయన్ తండ్రి వ్యాపారి ఎన్ ప్రవీణ్ కుమార్. తల్లి అనూష. వారు రాంనగర్‌లోని ఎస్‌బిఐ బ్రాంచ్ వద్ద నివాసం ఉంటున్నారు. వినాయక చవిత సమీపిస్తుండడంతో ప్రవీణ్, అనూష ఇంటిని శుభ్రం చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో ఆయన్ ఇంటిలోని గదిలో ఆడుకుంటున్నాడు.

గదిలోని డ్రెసింగ్ టేబుల్ అప్పటికే దెబ్బ తిన్నది. దీంతో రాళ్లు పెట్టి దాన్ని నిలబెట్టారు. బ్యాలెన్స్ లేకపోవడంతో డ్రెసింగ్ టేబుల్ పడిపోయింది. ఆయన్ అందులో చిక్కుకున్నాడు. ఆయన్ తలకు గాయమై రక్తస్రావం కావడాన్ని అనూష గుర్తించింది..

దాంతో తల్లిదండ్రులు కుమారుడిని విద్యానగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత బంజారాహిల్స్‌వోని మరో ఆస్పత్రికి తరలించారు. చిన్నారి మరణించినట్లు పోలీసులు ప్రకటించారు. పోలీసులు కేసు నమోదు చేయలేదు.












Click it and Unblock the Notifications