ప్రేమ వేధింపులపై నిర్భయ కేసు: దొంగల పట్టివేత

ధర్మపురి మండలం సిరికొండ గ్రామానికి చెందిన చెన్నమల్ల రవి అనే డిగ్రీ విద్యార్థి తనను ప్రేమించాలంటూ సిమ్రాన్ బేగంను వేధించసాగాడు. దీంతో తల్లిదండ్రులు సిమ్రాన్ బేగంను కళాశాలకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంచుతున్నారు. అయితే రవి ఎలాగైనా సిమ్రాన్‌ను పెళ్లి చేసుకోవాలని తన మిత్రులైన అరుణ్, వెంకటేష్‌లను ఆశ్రయించాడు. వారు సిమ్రాన్ బేగం ఇంటి పక్కనే ఉంటున్న యశోద, రాణి అనే యువతులతో రాయబారం పంపారు.
శనివారం సాయంత్రం రవి 16 మంది స్నేహితులతో కలిసి చల్‌గల్‌కు వెళ్లి సిమ్రాన్ బేగంను పెళ్లి చేసుకోవాలని వేధించాడు. ఇంతలోనే ఆమె తల్లిదండ్రులు ఇంటికి రావడంతో యువకులంతా జగిత్యాల వైపు పారిపోయారు. గ్రామస్తులు కొంత మందిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే విద్యార్థిని తల్లిదండ్రులు ఎక్కడ పరువు పోతుందోనని పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
ఈ సంఘటనతో మనస్తాపం చెందిన సిమ్రాన్ బేగం ఆదివారం ఉదయం ఇంట్లో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ప్రస్తుతం 70 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతోంది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై నిర్భయ కేసు నమోదు చేశారు. మరి కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జగిత్యాల కోర్టు రెండో అదనపు మేజిస్ర్టేట్ రమేష్ ఏరియా ఆస్పత్రికి వచ్చి సిమ్రాన్ వద్ద వాంగ్మూలం నమోదు చేసుకున్నారు.
పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు అంతర్‌జిల్లా దొంగలను ఆదివారం నిజామాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి డీఎస్పీ భాస్కర్ వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లాకు చెందిన సోహెల్ అలియాస్ సుదర్శనాచారి, కామారెడ్డి పట్టణానికి చెందిన విక్రమ్ ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడ్డారు.
వీరిద్దరు కలిసి రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లో రెండు బైకులు, కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట, నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి, దేవునిపల్లి, సిరికొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒక్కో చోట ఒక్కో ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశారు. వారి నుంచి 7 ద్విచక్ర వాహనాలను, రూ.48 వేలు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.












Click it and Unblock the Notifications